
Samarasimha Reddy Child Artist: తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్స్ ట్రెండ్ కి తెరలేపిన చిత్రం నందమూరి బాలకృష్ణ హీరో గా నటించిన ‘సమరసింహా రెడ్డి’ చిత్రం.అప్పట్లో ఈ సినిమా సృష్టించిన ప్రభంజనం గురించి ఎంత చెప్పినా అది తక్కువే అవుతుంది.అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్నిటినీ బద్దలు కొట్టి సుమారుగా ఆరోజుల్లోనే 16 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను సాధించి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది.అప్పట్లో ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడానికి ప్రధాన కారణాలలో ఒకటి సెంటిమెంట్.
ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా కూడా ఇచ్చిన మాట కోసం తన సొంత చెల్లెల్లు గా భావించి బాలయ్య వాళ్ళ కోసం పడే తాపత్రయం చూస్తే ఎలాంటి వాడికైనా కన్నీళ్లు రాక తప్పదు.అలా మాస్ తో పాటుగా సెంటిమెంట్ కూడా అద్భుతంగా పండడం వల్లే ఈ చిత్రం అంత పెద్ద ఇండస్ట్రీ హిట్ అయ్యింది.
ఇక ఈ సినిమాలో బాలకృష్ణ చిన్న చెల్లెలుగా దివ్యంగురాలిగా నటించిన సరస్వతి పాత్రని అంత తేలికగా ఎవరు మాత్రం మర్చిపోగలరు.సమరసింహా రెడ్డి సినిమా పేరు చెప్తే మనకి గుర్తుకు వచ్చే రెండు మూడు సన్నివేశాల్లో సరస్వతి రైల్వే ట్రాక్ సన్నివేశం కచ్చితంగా ఉంటుంది.ఈ పాత్ర పోషించిన అమ్మయి పేరు సహస్ర.ఈమె ఈ సినిమాకి ముందు ఎన్నో వందల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్టుగా చేసింది.ఈ సినిమా తర్వాత చదువుపై శ్రద్దపెట్టినా సహస్ర, నేడు గొప్ప బిజినెస్ మ్యాన్ గా చలామణి అవుతుంది.అయితే ఈమె చాలా కాలం తర్వాత ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఎవరికీ తెలియని ఆసక్తి విషయాలు పంచుకుంది.

ఆమె మాట్లాడుతూ ‘చిన్నప్పుడు నేను చాలా ముద్దుగా ఉండడం తో అందరూ నన్ను ఎంతో బాగా చూసుకునేవారు.చిరంజీవి గారితో రౌడీ అల్లుడు సినిమా చేస్తున్న సమయం లో నన్ను ఆయన ఇంటికి తీసుకెళ్లాడు.అక్కడ రామ్ చరణ్ కి ఎంతో ఇష్టమైన టెడ్డీ బీర్ కనిపించేలోపు దాంతో ఆడుకుంటూ ఉండేదానిని.రామ్ చరణ్ కూడా నాకు చిన్నప్పుడు మంచి స్నేహితుడు, ఇప్పటికి బెస్ట్ ఫ్రెండే, అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటాము’ఆ అంటూ ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది సహస్ర.