Lakshmi Devi: ప్రతి వారు తమ ఇంట్లో లక్ష్మీదేవి కొలువుండాలని భావిస్తారు. డబ్బుకు లోటుండకుండా చూడాలని ప్రార్థిస్తుంటారు. నిరంతరం తమ ఆర్థిక ఇబ్బందులు తొలగిపోవాలని కోరుకుంటారు. లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతుంటారు. తమ ఇంట్లో ఐశ్వర్యం వెల్లివిరియాలని కలలు కంటుంటారు. ఇల్లును అత్యంత పవిత్రంగా ఉంచుకోవాలని చూస్తారు. ఎప్పుడు శుభ్రంగా ఉండే ఇంట్లోనే లక్ష్మీ దేవి స్థిర నివాసం ఏర్పాటు చేసుకుంటుందని విశ్వసిస్తారు. ఇందులో భాగంగానే లక్ష్మీదేవి కటాక్షం కోసం అహర్నిశలు శ్రమిస్తుంటారు.

చాలా మంది తమ చేతుల్లో ధనం నిలవడం లేదని బాధపడుతుంటారు. లక్ష్మీదేవి దయ మాపై ఉండటం లేదని మథనపడుతుంటారు. లక్ష్మీదేవి అనుగ్రహం తమ ఇంటిపై పడాలని ఆశ పడుతుంటారు. లక్ష్మీదేవి కొలువుంటే ఆ ఇంటిలో సిరిసంపదలకు లోటుండదని భావిస్తారు. ఆమె అనుగ్రహం పొందాలని ఎన్నో భక్తి కార్యక్రమాలు చేపడతారు. పూజలు, వ్రతాలు నిర్వహిస్తారు. సకల సంపదలు కలగాలని, ఇల్లంతా శుభాలతో నిండాలని కోరుకుంటారు. దీని కోసం ఎన్నో పరిహారాలు చేస్తుంటారు.
లక్ష్మీదేవి అనుగ్రహం కలిగితే ఆ ఇంటిలో లోటు ఉండదు. డబ్బు ఎల్లప్పుడు నిలువ ఉంటుంది. ఏ ఇంట్లోనైతే ప్రేమ, శాంతి, ఆనందం వెల్లివిరుస్తుంటాయో ఆ ఇంటిలో సుఖశాంతులు తులతూగుతాయి. లక్ష్మీదేవి కృప ఉంటే వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవు. ఇల్లంతా ధన ధాన్యాలతో నిండిపోతుంది. ఏ పని అయినా ఇట్టే జరిగిపోతుంది. ఏ ఆటంకాలు రాకుండా పనులు సాఫీగా సాగుతాయి. ప్రతి రోజు ఉదయాన్నే తలస్నానం చేసి తర్వాత శుభ్రమైన దుస్తులు ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి.

లక్ష్మీదేవికి నిరంతరం పూజ చేయడం ద్వారా మనకు ఎన్నో రకాల లాభాలు కలుగుతాయి. లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు తామర పువ్వును ఆమె ముందు ఉంచాలి. ఇలా చేయడం వల్ల కూడా లక్ష్మీ దేవి అనుగ్రహం పొందవచ్చు. శ్రీ సూక్తిని పాటించాలి. మన ఇల్లు శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి. ప్రతి రోజు ఉదయం స్నానం చేసిన తరువాత ఇంటి ముఖద్వారం వద్ద గంగాజలాన్ని చల్లి పసుపు కుంకుమతో స్వస్తిక్ గుర్తును వేయాలి. ఇలా చేయడం వల్ల లక్ష్మీ దేవి మన ఇంటిలో కొలువుంటుందని నమ్ముతారు.