
Traffic Jam Love Story: ప్రేమ.. ఎప్పుడు, ఎక్కడ, ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ట్రాఫిక్ జామ్ మాములుగా ఉండదు. అక్కడ పీక్ అవర్స్‌లో వాహనంపై బయటకు వెళ్లాలంటే గగనమే అని వాహనదారులు వాపోతుంటారు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ కారణంగా నరకం అనుభవిస్తుంటారు. అయితే అలాంటి ట్రాఫిక్ జామ్‌లో ఓ ప్రేమకథ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తాజాగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో ఓ ప్రియురాలు ప్రియుడితో గొడవపడి ట్రిఫిక్‌ను స్తంభింపజేసింది. ఇప్పుడు ఇది కూడా వైరల్ అవుతోంది.
సిగ్నల్స్ వద్ద లవ్ స్టోరీ..
బెంగళూరులోని కోరమంగళ ప్రాంతంలో నిత్యం ట్రాఫిక్ జామ్ అయ్యే ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద ట్రాఫిక్ జామ్ మధ్యలో సిగ్నల్ వద్ద సదరు లవ్‌స్టోరీ ప్రారంభమైంది. ఒక రోజు తన వాహనంపై తన స్నేహితురాలిని డ్రాప్ చేస్తున్న సమయంలో ఎజిపురా ఫ్లైఓవర్ వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యిందని.. అయితే ఒకవైపు ఆలస్యం, మరోవైపు ఆకలి వేస్తుండటంతో తాము మరోదారిలో వెళ్లాల్సి వచ్చిందని ఓ వ్యక్తి వివరించాడు. ఈ సందర్భంగా ఆ మార్గంలో వెళ్తూ తామిద్దరం డిన్నర్ చేశామని.. అలా ఇద్దరం ప్రేమలో పడ్డామని తెలిపాడు. ఈ లవ్‌స్టోరీ చాలా ఆసక్తికరంగా ఉందని.. బాలీవుడ్ దీనిని బిగ్‌స్క్రీన్‌పైకి ఎక్కించాలంటూ కొందరు చమత్కరించారు.

రోడ్డుపై ప్రేమ గొడవ..
ఇక కర్ణాటకలో జరిగినదానికి ఇరుద్ధంగా మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో జరిగింది. ఓ యువతి తన ప్రియుడితో గొడవపడి ఫుల్లుగా మద్యం సేవించింది. అనంతరం కారు క్యాబిన్‌పై కూర్చుని రోడ్డుపైకి వచ్చింది. ప్రధాన చౌరస్తాలో రోడ్డుకు అడ్డంగా కారు పార్కుచేసి ట్రాఫిక్‌ను ఆపే ప్రయత్నం చేసింది. గమనించిన స్థానిక పోలీసులు హుటాహుటిన ఆమె వద్దకు వచ్చి ట్రాఫిక్ క్లియర్ చేసే ప్రయత్నం చేశారు. ఆమె వినకపోవడంతో అదుపులోకి తీసుకున్నారు. అప్పటికే ట్రాఫిక్ కిలోమీటర్ మేర నిలిచిపోయింది. ఎందుకలా చేసిందని పోలీసులు యువతిని ఆరా తీయగా భర్తతో గొడవ జరిగిందని తెలిపింది. ఇప్పుడు ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
https://www.youtube.com/watch?v=ckJk1SIO8Ww