
Dasara USA Premiere Show: న్యాచురల్ స్టార్ నాని హీరో గా నటించిన దసరా చిత్రం రేపు ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో అన్నీ బాషలలో ఘనంగా విడుదల కాబోతుంది. హీరో నాని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా ఇది. స్టార్ హీరో రేంజ్ కి ఎదిగే కెపాసిటీ ఉన్నప్పటికీ, కేవలం మీడియం బడ్జెట్ సినిమాలను చేస్తూ తన మార్కెట్ ని ఒక రేంజ్ కి మాత్రమే పరిమితం చేసేసాడు.
ఆ రేంజ్ నుండి స్టార్ రేంజ్ కి ఎదిగే సినిమా ఎప్పుడు చేస్తాడు అని అందరూ ఎదురు చూస్తున్న సమయం లో ‘దసరా’ అనే చిత్రం చేస్తున్నాను అని ఒక అధికారిక ప్రకటన వచ్చింది. ఈ సినిమా ప్రారంభమైన రోజు నుండి నేటి వరకు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్స్ తప్ప ఎక్కడా కూడా నెగటివ్ వైబ్రేషన్స్ కి తావు ఇవ్వలేదు. దానికి తగ్గట్టుగానే టీజర్ , ట్రైలర్ మరియు పాటలు అన్నీ కూడా మూవీ పై అంచనాలను అమాంతం పెంచేలా చేసింది.
అయితే ఈ సినిమాకి సంబంధించిన ప్రీమియర్ షో USA లో డిస్ట్రిబ్యూటర్స్ కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేశారట. ఈ షోస్ నుండి వచ్చిన టాక్ ని ఒకసారి పరిశీలిస్తే ఈ చిత్రం నాని ని మరో లెవెల్ కి తీసుకెళ్తుంది అనడం లో ఎలాంటి సందేహం లేదని అంటున్నారు. ఇందులో ఆయన నటన అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేసే విధంగా ఉంటుందట, అంత మాస్ గా అంత రూస్టిక్ గా ఉంటుందట. చాలా సన్నివేశాల్లో నాని నటనకి రోమాలు నిక్కపొడుస్తాయట, కొన్ని సన్నివేశాలకు మనకి తెలియకుండానే బావిద్వేగానికి లోనైపోతాము అట.

కేవలం నాని మాత్రమే కాదు, హీరోయిన్ కీర్తి సురేష్ కూడా అద్భుతంగా నటించింది అంటున్నారు. ఇక ఈ చిత్ర దర్శకుడు ‘శ్రీకాంత్ ఓదెల’ కచ్చితంగా టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకడిగా నిలిచిపోతాడని కూడా అంటున్నారు, మరి రేపు పూర్తిగా విడుదలైన తర్వాత ఇదే రేంజ్ రెస్పాన్స్ వస్తుందో లేదో చూడాలి.