American Wife and Husband: కొందరికి శృంగార కాంక్ష ఎక్కువే ఉంటుంది. దీంతో ఆడవారు ఇబ్బందులు పడటం తెలిసిందే. పురుషుల ఆగడాలు తట్టుకోలేక విడాకులు తీసుకున్న వారు సైతం ఉన్నారు. అలాంటి విచిత్రమైన మసస్తత్వం గల వారు కోకొల్లలు. పుర్రెకో గుణం.. జిహ్వకో రుచి అన్నారు. అలాగే ఒక్కొక్కరు ఒక్కో విధంగా ప్రవర్తిస్తుంటారు. వేపకాయంత వెర్రి వేయి రకాలుగా ఉంటుందట. మనుషుల్లో రకరకాల మనస్తత్వాలు ఉండటం సహజమే. కొందరికి డబ్బు మీద యావ ఉంటుంది. కొందరికి తాగుడంటే ఇష్టం. మరికొందరికి ఆడాళ్లంటేనే ఇష్టం. ఇలా రకరకాల వారు మన సమాజంలో ఉండటం తెలిసిందే.

ఈ నేపథ్యంలో అమెరికాలో ఓ వివాహిత విచిత్రమైన పని చేసింది. తన భర్తతో శృంగారంలో వేగలేక ప్రత్యామ్నాయంపై దృష్టి సారించింది. ఇంకేముంది తనకో ఆలోచన తట్టింది. అదే తడవుగా ఆచరణలో పెట్టింది. అచ్చం తనలా ఉండే ఓ బొమ్మను తీసుకొచ్చింది. దాని పేరు దీ అని పెట్టింది. దీంతో ఆమె ఇంట్లో లేనప్పుడు భర్త బొమ్మతో తన శృంగార కోరికలు తీర్చుకుంటున్నాడట. సో ఆమెకు భర్త నుంచి బాధలు తప్పాయి. భలేగా ఆలోచించింది ఆమె. తన భర్తను సంతోష పెట్టడానికి ఇలా ఆలోచించినట్లు ఆమె చెబుతోంది.
అమెరికాకు చెందిన చార్ గే (23), తన భర్త రాండీ కల్లమ్ (28) కోసం ఇలాంటి వ్యూహం పన్నింది. దీంతో తన భర్త నుంచి ఇప్పుడు బాధలు తప్పాయని చెబుతోంది. తాను తీసుకొచ్చిన బొమ్మతో రాండీ ఎప్పుడు బిజీగా ఉంటున్నాడట. ఇల్లాళ్లకు భలే ఆలోచనలు వస్తాయి. మొత్తానికి భర్త బాధల నుంచి విముక్తి పొందేందుకు చార్ గే ఇలాంటి ఉపాయం పన్నింది. ఎప్పుడు సెక్స్ అంటూ వేధించడంతో బొమ్మతోనే అతడు ఎక్కువ సేపు గడుపుతున్నట్లు తెలుస్తోంది.

మొత్తానికి చార్ గే చేసిన పని ఎందరికో స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. భార్యలను నిత్యం వేధించే భర్తలకు ఇదో చక్కని మార్గం. దీ రాకతో తన భర్త దాంతోనే ఎక్కువ సమయం గడపడంతో శృంగార వేధింపులు తగ్గాయి. ఇప్పుడు అన్యోన్యంగా ఉంటున్నామని చెబుతోంది. రాండీ కోరికను తీర్చడానికి ఆయన శ్రీమతి పన్నిన ఉపాయం అందరు గృహిణులు పాటిస్తే అలాంటి బాధల నుంచి విముక్తి కలుగుతుంది. ఫలితంగా వారి మధ్య ప్రేమానురాగాలు చిగురిస్తాయి. ఆప్యాయత, అనురాగం రెట్టింపు అవుతుంది. అందరు ఇలా ఆలోచిస్తే మంచిదే అని పలువురు నిపుణులు పేర్కొంటున్నారు.
Also Read:India Tour Of West Indies: విజయోత్సాహంతో బయలుదేరిన టీమిండియా.. వెస్టిండీస్ లో విజయాలు సాధిస్తుందా?