Indian Medicine: భారతదేశం సాంప్రదాయాలకు పుట్టినిల్లు. ఎన్నో వేల సంవ్సరాల చరిత్ర ఉన్న మనదేశంలో విభిన్న మతాల వారు ఉన్నారు. ఎవరి సాంప్రదాయాలకు అనుగుణంగా వారు జీవిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు కట్టు, బొట్టే వేషధారణ విభిన్నంగా కనిపిస్తుంది. వెయ్యేళ్ల కిందట దేశంలో అంతా ఒక్కటై జీవించేవారు. ఆ సమయంలో కులం, మతం, ప్రాంతీయ బేధం అనేది ఉండేది కాదు. కేవలం ఆహారం కోసం మాత్రమే జీవించేవారు. ఇప్పటి లాగా ఆ సమయంలో తినడానికి తిండి దొరికేది కాదు. కేవలం మనుగడ కోసం మాత్రమే కష్టపడేవారు. మరి ఆ సమయంలో వారి వేషధారణ ఎలా ఉండేదంటే?
పూర్వకాలంలో ఎక్కువగా ఆహారం కోసం మాత్రమే కష్టపడేవారు. ఇలాంటి సమయంలో వారు ఇతర విషయాల కోసం వెళ్లకుండా ఆహారాన్ని పండించే మార్గాలను ఆలోచించేవారు. ఒకప్పుడు వ్యవసాయం ద్వారానే తిండి దొరుకుతుందని గుర్తించారు. దీంతో ఆహారాన్ని పండించడానికి కుటంబ సభ్యులంతా పనులకు వెళ్లేవారు. ఇతర వ్యాపకాల జోలికి వెళ్లకుండా పొద్దంతా పనుల చేసి రాత్రి ఆహారాన్ని తిని పడుకునేవారు.
ఈ సమయంలో మగవాళ్లు కేవలం దోవతి మాత్రమే ధరించేవారు. వారి శరీరంపై ఎలాంటి షర్ట్ ఉండేది కాదు. మగ పిల్లలకు కూడా కేవలం కింది భాగంలో మాత్రమే కొన్ని గుడ్డలను కట్టుకునేవారు. కానీ ఆడవాళ్లు మాత్రం అప్పటికి ఇప్పటికీ ఒకే సాంప్రదాయాన్ని పాటిస్తున్నారు. ఆ కాలంలోనే చీరలను ఎక్కువగా కట్టుకునేవారు. ఆడపిల్లలకు మాత్రం చీరలాగా ఉండే వస్త్రాన్ని వేసేవారు. ఏదైనా పనిచేయాలంటే చిన్నా, పెద్ద అని తేడా లేకుండా అందరూ కలిసి జీవించేవారు.
వెయ్యేళ్ల కిందట ఎక్కువగా ఎలాంటి వ్యాధి వచ్చినా అడవిలో దొరికే చెట్ల పసరుపై ఎక్కువగా ఆధారపడేవారు. కొందరు తెలివైన వారు ఆయుర్వేద మెడిసిన్ తయారు చేసి అందించేవారు. అయితే పెద్ద వ్యాధి వస్తే మాత్రం మరణమే శరణ్యం అన్నట్లు ఉండేవారు. అలా ఆ కాలంలో మిగతా వ్యాపకాలకు పోకుండా కేవలం ఆహారం కోసం మాత్రమే జీవించి, ఎలాంటి ఆడంబరాలకు పోలేదు. అప్పటి విషయాలను గుర్తు చేస్తూ కొందరు చిత్రకారులు వేసిన ఆర్ట్స్ ఎంతో ఆకట్టుకుంటున్నాయి.