Fastest Animals: భూమిపై మానవుడితోపాటు అనేక జీవజాతులు ఉన్నాయి. ఇందులో వేటికవే ప్రత్యేకం. వాతావరణ మార్పులు, ప్రకృతి వైపరీత్యాల కారణంగా కొన్ని జాతులు అంతరించిపోతున్నాయి. కాలుష్యం కాటుకు మరికొన్ని కనుమరుగయ్యాయి. మానవుడే అన్నిటికీ తట్టుకుని నిలబడగలుగుతున్నాడు. అయితే భూమి మీద ఉన్న జీవరాశుల్లో కొన్ని అత్యంత వేగంగా వెళ్తుంటాయి. అలాంటి పది జంతువుల గురించి తెలుసుకుందాం.
– పెరెగ్రైన్.. ఇది గద్ద. అత్యంత వేగంగా వెళ్లగలదు. ఇది గంటకు 386 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది.
– చిరుత.. అత్యంత వేగంగా పరిగెత్తే జంవుతువుల్లో ఒకటి చిరుత. ఇది గంటకు 120 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుంది.
– సముద్రాల్లో కనిపించే సెయిల్ ఫష్ అనే జీవులు అత్యంత వేగంగా నీటిలో పయనిస్తాయి. ఇవి గంటకు 68 మైళ్ల వేగంతో ఈదుగతాయి.
– స్పర్–వింగ్డ్‌గూస్.. ఇది కూడా పక్షి. ఈది గద్దకన్నా కాస్త తక్కువ వేగంతో వెళ్తుంది. గంటకు142 మైళ్ల వేగంతో ఎగురుతుంది.
– మెక్సికన్ ప్రీ–టెయిల్డ్.. ఇది గబ్బిలాల జాతి జంతువు. ఇది కూడా అత్యంత వేగంగా ఎగరగలదు. గంటకు 100 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.
– సింహం.. అడవికి రాజుగా పిలిచే సింహం కూడా అత్యంత వేగంగా పరిగెత్తే జంతువుల్లో ఒకటి. ఇది గంటకు 50 మైళ్ల వేగంతో పరిగెత్తి వేటాడుతుంది.
– ఐరోపా కుందేలు.. కుందేళ్లు చాలా వేగంగా పరిగెత్తుతాయి. ఐరోపా కుందేళ్లు సాధారణ కుందేళ్లకన్నా వేగంగా పరిగెత్తుతాయి. గంటకు 47 మైళ్ల స్పీడ్‌తో పరిగెత్తగలవు.
– ఆఫ్రికన్ వైల్డ్ డాగ్.. ఇది కుక్క.. ఇది వేటాడే సమయంలో గంటకు 37 మైళ్ల వేగంతో పరిగెత్తుతుంది.
– బ్లూ వైల్డ్ బీస్ట్.. ఇది ఒకరకమైన గేదె జాంతి జంతువు. ఇది కూడా బాగా పరిగెత్తుతుంది. గంటకు 50 మైళ్ల వేగాన్ని అందుకుంటుంది.
– నిప్పు కోడి.. పక్షి జాతిలో అతిపెద్దతి నిప్పుకోడి. అయితే ఇది కూడా వేగంగా పరిగెత్తుతుంది. గంటకు 45 మైళ్ల వేగాన్ని అందుకోగలదు.