Homeఎంటర్టైన్మెంట్Sudigali Sudheer: షకీలా తో మీకేం పని సుధీర్ ఫ్యాన్స్ పై బుల్లెట్ భాస్కర్...

Sudigali Sudheer: షకీలా తో మీకేం పని సుధీర్ ఫ్యాన్స్ పై బుల్లెట్ భాస్కర్ సెటైర్లు… పరువు తీసేశాడుగా!

Sudigali Sudheer: బుల్లితెర పై సుడిగాలి సుధీర్ ఓ సెన్సేషన్. జబర్దస్త్(Jabardasth) ద్వారా ఫుల్ పాపులారిటీ సంపాదించాడు. కమెడియన్ గా యాంకర్ గా స్మాల్ స్క్రీన్ పై సత్తా చాటాడు. భారీ స్థాయిలో అభిమానులను సొంతం చేసుకున్నాడు. కొంతకాలంగా సుధీర్ బుల్లితెర షో లకు దూరంగా ఉంటున్నాడు. హీరోగా బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయాడు. సుధీర్ జబర్దస్త్ లో లేకపోయినప్పటికీ అతని ప్రస్తావన లేకుండా స్కిట్లు మాత్రం ఉండవు. కమెడియన్స్ సుధీర్ ని గుర్తు చేసుకుంటూ రకరకాలుగా ఫన్ జనరేట్ చేస్తూ ఉంటారు.

ఈ నేపథ్యంలో తాజాగా బుల్లెట్ భాస్కర్(Bullet Bhaskar) సుధీర్ పై పంచులు వేశాడు. పైగా సుధీర్ ఫ్యాన్స్ కి ఓ రేంజ్ లో సెటైర్లు వదిలాడు. ఈ స్కిట్ లో బుల్లెట్ భాస్కర్ డైరెక్టర్ రోల్ చేశాడు. అసిస్టెంట్ వచ్చి… బాబు కాల్ చేస్తున్నాడు సార్ అని చెబుతాడు. ఏ బాబు అని భాస్కర్ అడుగుతాడు. సుడిగాలి బాబు అని అసిస్టెంట్ చెబుతాడు. దీంతో భాస్కర్ .. వాడికి చిలక్కి చెప్పినట్లు చెప్పా .. ఫిబ్రవరి, మార్చి పెళ్లిళ్ల సీజన్ రా ..చక్కగా మ్యాజిక్ షో లు చేసుకుంటే ఈవెంట్ కి ఐదు వేలు ఇస్తారు, అని పంచ్ వేశాడు.

ఇంకా డైలాగ్ కొనసాగిస్తూ… అయితే ఈ స్కిట్ చూసిన తర్వాత సుధీర్ ఫ్యాన్స్ .. ఒరేయ్ బుల్లెట్ భాస్కర్ కి గ్రౌండ్ ఫ్లోర్ బాగా బలిసింది అంటారు. ఎవర్రా మీరంతా ఒక్కొక్కరు నాలుగు మెయిల్ ఐడిలతో కామెంట్లు పెడితే భయపడతామా .. షకీలా సినిమా కింద మీకేం పని రా .. వి వాంట్ సుధీర్ అంటారు. ఉదయం జాతకాల ప్రోగ్రాం లో సుధీర్ అన్న సూపర్ అంటారు, అని భాస్కర్ పంచులు వేశాడు. దీంతో సెట్ లో ఉన్నవాళ్ళంతా రష్మీ తో సహా అందరూ తెగ నవ్వేశారు.

ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమో వైరల్ అవుతుంది. ఇక సుధీర్ విషయానికొస్తే హీరోగా .. సాఫ్ట్ వేర్ సుధీర్, త్రీ మంకీస్, గాలోడు, కాలింగ్ సహస్ర వంటి చిత్రాల్లో నటించాడు. గాలోడు మూవీ తో హిట్ అందుకున్నాడు. ఇటీవల వచ్చిన కాలింగ్ సహస్ర అనుకున్నంతగా ఆడలేదు. ఇక త్వరలో సుధీర్ GOAT సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. దీనిపై అంచనాలు ఉన్నాయి.

RELATED ARTICLES

Most Popular