Bigg Boss 6 Telugu- Srihan: మొన్న జరిగిన బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే లో టైటిల్ విన్నర్ గా రేవంత్ మరియు రన్నర్ గా శ్రీహాన్ నిలిచిన సంగతి అందరికీ తెలిసిందే..శ్రీహాన్ బిగ్ బాస్ ఇచ్చిన 40 లక్షల రూపాయల ఆఫర్ ని ఒప్పుకొని రన్నర్ గా మిగలగా రేవంత్ మాత్రం తాను కోరుకున్న ట్రోఫీని గెలుచుకొనే బయటకి వచ్చాడు..కానీ పాపం శ్రీహన్ ని చూసి సంతోషపడాలా, లేదా జాలి పడాలా అనేది అర్థం కావడం లేదు..జనాలు వేసిన ఓట్ల ప్రకారం అతి తక్కువ మార్జిన్ తో శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చాయని నాగార్జున చెప్తాడు.

ఆ విధంగా చూసుకుంటే శ్రీహాన్ ఆ 40 లక్షల ఆఫర్ ని ఒప్పుకోకపోయి ఉంటే 50 లక్షల రూపాయిల క్యాష్ ప్రైజ్ తో పాటు, ఫ్లాట్ మరియు కారు దక్కేది..కానీ శ్రీహాన్ ఒప్పుకోవడం వల్లే..రేవంత్ కి తక్కువ క్యాష్ ప్రైజ్ వచ్చిందని ప్రేక్షకుల్లో నెగటివిటీ బాగా పెరిగిపోతుందనే ఉద్దేశ్యం తోనే చివరి నిమిషం లో శ్రీహాన్ కి ఎక్కువ ఓట్లు వచ్చినట్టు నాగార్జున కావాలనే అబద్దం చెప్పాడంటూ సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి.
ఇక శ్రీహాన్ తనకి వచ్చిన 40 లక్షలు + 5 లక్షల లెన్స్ కార్ట్ మనీ మొత్తం 45 లక్షలలో ఎంతో కొంత అనాధాశ్రమానికి కానీ, వృద్ధాశ్రమంకి కానీ డొనేట్ చేస్తాడేమో అని అనుకున్నారు..కానీ అలాంటిది ఏమి చెయ్యలేదు..తనకి వచ్చిన డబ్బులు మొత్తాన్ని సొంత ఇల్లు కట్టుకోవడానికి ఉపయోగించబోతున్నాడట.

అంతే కాకుండా ‘సువర్ణ భూమి’ తరుపున శ్రీహాన్ కి భవిష్యత్తులో తమ సంస్థ ద్వారా ఏమి కావాలన్నా 50 శాతం డిస్కౌంట్ ఇస్తామని ఒక బంపర్ ఆఫర్ ఇస్తాడు..ఆ ఆఫర్ ని గుర్తు చేస్తూ త్వరగా అక్కడ ఇల్లు కట్టుకోవాలి అంటూ శ్రీహాన్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి..ఇక తన కాబొయ్యే భార్య సిరి కి కూడా మంచి విలువైన బహుమతి ఇవ్వబోతున్నాడట..ఇక బిగ్ బాస్ హౌస్ నుండి బయటికి వచ్చిన తర్వాత శ్రీహాన్ కెరీర్ ఎలా ఉండబోతుందో చూడాలి.
