
Solar Eclipse Bugs: గ్రహణాలు మనకు అశుభాలు కలిగిస్తాయి. అందులో చంద్రగ్రహణం కంటే సూర్య గ్రహణానికి ముప్పు ఎక్కువగా ఉంటుంది. దీని వల్ల మనకు ఎన్నో ఇబ్బందులొస్తాయి. ఈ నేపథ్యంలో సూర్యగ్రహణం వల్ల నాలుగు రాశుల వారికి తిప్పలు తప్పేలా లేవు. కొన్ని రాశులపై పెను ప్రభావం చూపనుంది. సూర్యగ్రహణం ప్రతికూల ప్రభావాలను ఇస్తుంది. సూర్యగ్రహణం ప్రభావాల నుంచి తప్పించుకునేందుకు కొన్ని పరిహారాలు పాటించాలి. అవేంటో తెలుసుకుందాం.
సూర్యగ్రహణం సమయంలో మేష రాశి వారు ఎరుపు రంగు వస్తువులను దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. ఎరుపు రంగు బట్టలు, ఎరుపు రంగు వస్తువులు దానం చేయడంతో మేష రాశి వారికి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సూర్యగ్రహణం సమయంలో వ్రషభ రాశి వారు తెలుపు రంగు వస్తువులను దానం చేయాలి. అన్నం, పాలు, పెరుగు, కర్పూరం వంటి పదార్థాలు దానం చేయడం వల్ల మంచి జరుగుతుంది.
ఇక మిథున రాశి వారు పచ్చని వస్తువులు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. కూరగాయలు, పచ్చి బఠాణీలు దానం చేస్తే శ్రేయస్కరం. సింహరాశి వారు ఎరుపు, నారింజ రంగు వస్తువులను దానం చేయాలి. బెల్లం, గోధుమలు వంటి ఆహార పదార్థాలు దానం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. కర్కాటక రాశి వారు తెల్లని వస్తువులు దానం చేయాలి. అన్నం, పాలు, స్వీట్లు, తెల్లని వస్త్రాలు దానం చేస్తే మంచిది.

కన్యారాశి వారు పచ్చి కూరగాయలు దానం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. సూర్య గ్రహణం తరువాత ఆవుకు పచ్చి మేత తినిపించి దుర్గాదేవికి ఎర్రని వస్త్రాన్ని సమర్పిస్తే మంచి జరుగుతుందని చెబుతున్నారు. ఇలా గ్రహణ సమయంలో జాగ్రత్తలు తీసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. దీనికి అందరు గ్రహించుకుని దానాలు చేయడం వల్ల ఆయా రాశుల వారికి పట్టిన దోషాలు తొలగిపోతాయి.