Rameswaram Cafe Blast: కొన్ని ప్రాంతాల్లో కొన్ని ప్లేస్ లు స్పెషల్ గా ఉంటాయి. హైదరాబాద్ అనగానే చార్మినార్, గోల్కొండ వంటివి చూడాలి అనుకుంటారు ఈ పట్టణానికి వచ్చేవారు. అయితే ఇలాంటి ప్రాంతాలు ఏ నగరంలో అయినా ఉంటాయి. ఇక బెంగళూరుకు వెళ్లి రామేశ్వరం కేఫ్ అని అడిగితే చాలు దాని గురించి ఎవరైనా చెబుతారు. ఇంతకీ ఏంటి దీని ప్రత్యేకత అనుకుంటున్నారా. అయితే చూసేయండి.
బెంగళూరులో రామేశ్వరం కేఫ్ చాలా ఫేమస్. దీనికి సంబంధించిన బ్రాంచ్ ను హైదరాబాద్ లో కూడా ఓపెన్ చేశారు. అయితే 2021లో రామేశ్వరం కేఫ్ ఓపెన్ చేశారు. దివ్య రాఘవేంద్రరావు అనే వ్యక్తికి ఈ ఆలోచన వచ్చింది. ఇక్కడ సౌత్ ఇండియన్ వెజిటేరియన్ వంటలు, కాపీ, టీ దొరుకుతాయి. మొదటి బ్రాంచ్ బెంగళూరులో ఓపెన్ చేశారు. అయితే దీనికి రామేశ్వరం కేఫ్ అని పేరు పెట్టారు. ఇక ఈ పేరు వెనుక ఓ కథ కూడా ఉందట.
ఎంతో గుర్తింపు తెచ్చుకున్న ఒక గొప్ప వ్యక్తి అక్కడ పుట్టారు. ఆయన గొప్పదనానికి నిదర్శనంగానే ఆ పేరు పెట్టారట. అయితే ఆయన ఎవరో కాదు ఏపీజే అబ్దుల్ కలాం. ఈయన రామేశ్వరంలోనే పుట్టారు. అందుకే ఈ కేఫ్ కి ఆయన పేరు పెట్టారు. దివ్యరాఘవేంద్రరావు ముందు ఈ వ్యాపారం చేస్తాను అని ఇంట్లో చెప్పారట. కానీ వారు ఒప్పుకోలేదట. పెద్ద చదువులు చదివి ఈ వ్యాపారం ఏంటి అని అన్నారట. కానీ దివ్య మాత్రం ఎవరి ప్రోత్సాహం లేకుండా తన సొంత కాళ్ళ మీద నిలబడి చూపించారు.
అయితే ఎంతో మంది ప్రముఖులు బెంగళూరు వెళ్లినా ఈ రామేశ్వరం కేఫ్ కి కచ్చితంగా వెళ్లి వస్తారట. ఎన్నో అవార్డులు కూడా అందుకున్నారట ఆయన. అక్కడ నాణ్యత పరిమాణాలు కూడా ఉన్నత స్థాయిలో ఉంటాయట. ఇలా చాలా ప్రాచుర్యం పొందడంతో వారి సేవలను ఇతర ప్రాంతాలకు విస్తరిస్తున్నారు. ఇలా హైదరాబాద్ వచ్చిన రామేశ్వర్ కేఫ్ లో రుచి చూడడానికి చాలా మంది వెళ్తున్నారు. మరి ఇలాగే వీరు మరింత ఎదగాలని కోరుకుందాం..