Ancestors Comb: వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా నేటి కాలంలో చాలా మంది అనారోగ్యానికి గురవుతున్నారు. శరీరంలోని అవయవాలు అనారోగ్యానికి గురి కావడంతో పాటు శరీరంపై ఉండేవి కూడా దెబ్బతింటున్నాయి.. ముఖ్యంగా ఈ రోజుల్లో ఎక్కువ మంది హెయిర్ ఫాల్ సమస్య తో తీవ్ర వేదనకు గురవుతున్నారు. జుట్టు రాలడం, చుండ్రు సమస్యలతో బాధపడుతున్నారు. పూర్వకాలంలోని వారికి జుట్టు సమస్యలు అస్సలు ఉండేవి కావు. వారు హెయిర్స్ కు ఎలాంటి మెడిసిన్ కూడా వాడలేదు. కానీ వారి హెయిర్స్ ఆరోగ్యంగా ఉండేవి. అయితే ఒకప్పుడు ప్లాస్టిక్ దువ్వెనకు బదులు చెక్క దువ్వెనలను ఉపయోగించి హెయిర్ సరిచేసుకునే వారు. అలా చేయడం వల్ల అనారోగ్యానికి గురికాకుండా ఉన్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు. అంటే చెక్క దువ్వెనతో దూసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయా?
చెక్క దువ్వెనతో హెయిర్ సరి చేసుకోవడం వల్ల ఎన్నో లాభాలు ఉన్నాయని కొందరు వైద్యులు చెబుతున్నారు. చెక్క దువ్వెనలు పర్యవరణానికి మేలు చేస్తాయి. అంతేకాకుండా జుట్టు పెరుగుదలకు తోడ్పడుతాయి. చెక్క దువ్వెనతో దూసుకోవడం వల్ల తలలో రక్త ప్రసరణ మెరుగ్గా ఉంటుంది. చెక్క దువ్వెన ను ఉపయోగించడం వల్ల ఫోలికల్ ధ్రుఢంగా ఉంటాయి. స్కాల్ప్ హెల్త్ బాటుంటుంది. తల వెంట్రుకలు ఆరోగ్యంగా ఉండడానికి కొబ్బరి నూనెను రాస్తారు. ఈ నూనెను ప్లాస్టిక్ దువ్వెన పీల్చుకోదు. కానీ చెక్క దువ్వెన నూనును గ్రహిస్తుంది. దీంతో తలలో ఎక్కువ నూనె లేకుండా చేస్తుంది.
ప్లాస్టిక్ దువ్వెన లో దుమ్ము, ధూళి చేరి అలాగే ఉండిపోతుంది. కానీ చెక్క దువ్వెనలో ఇలా దుమ్ము నిలిచి పోదు. ఎప్పటికప్పుడు క్లీన్ గా ఉంటుంది. ఇది ఎక్కువగా దుమ్మును గ్రహించకుండా ఉంటుంది. ఇది పట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. చెక్క దువ్వెనతో సరిచేసుకోవడం వల్ల వెంట్రుకలు చిక్కులు పడకుండా ఉంటాయి.
చెక్క దువ్వెనతో దూసుకోవడం వల్ల తలకు మంచి మసాజ్ చేసినట్లు అవుతుంది. అయితే కలర్ వేసిన చెక్క దువ్వెనను కాకుండా ఆర్గానిక్ ను ఉపయోగించాలి. ఇలా చేయడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది. పురాతన కాలంలో ఎక్కువగా చెక్క దువ్వెనను ఉపయోగించేవారు. అందుకే ఆరోగ్యంగా ఉండేవారు. అయితే కొందరు ప్రత్యేకంగా చెక్క దువ్వెనను తయారు చేసి ఉపయోగించుకుంటున్నారు.