Karnataka Love Story: ప్రేమ.. ప్రపంచంలో అందమైన ఫీలింగ్.. అమ్మాయి, అబ్బాయి తియ్యటి మానసిక సంఘర్షణనను ప్రేమ అని పేరు పెట్టుకుని తాము ప్రేమలో ఉన్నామన్న భావనతో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ప్రేమ మత్తులో తేలియాడుతున్నారు. ఆ మత్తులో తాము ఏం చేస్తున్నామో గుర్తించడం లేదు. ఈ క్రమంలో జరగకూడనివి కూడా జరిగిపోతున్నాయి. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లుగా.. నష్టపోయాక లబోదిబోమంటున్నారు. ఇలాంటి వారిలో యువతులే ఎక్కువ. ఇటీవల కాలంలో ఆడపిల్లలు ఆలోచనాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రేమ, పెళ్లి విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం లేదు. అయినా మోసగాళ్ల మాయ మాటలకు లొంగిపోతున్నారు. చివరకు శారీరకంగా దగ్గరవుతున్నారు. పెళ్లి విషయం వచ్చే సరికి పెద్దలు అంగీకరించడం లేదని, లేదా కుల, మతాల పేర్లు చెప్పి ప్రేమించిన అమ్మాయికి బ్రేకప్ చెప్పేస్తున్నారు. తాజాగా అమృతది ఇదే పరిస్థితి.
శారీరకంగా దర్గరయ్యారు.. పెళ్లికి దూరం అన్నాడు..
కర్ణాటకలోని బళ్లారికి చెందిన అమృతకు తన స్నేహితురాలి మరిది సునీల్‌తో పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారింది. ఇద్దరూ శారీరకంగా బాగా దగ్గరయ్యారు. యువతి పెళ్లి ప్రస్తావన తీసుకురాగానే కులం అడ్డు వచ్చింది. శారీరకంగా కలిసే టప్పుడు కులం గోడ అడ్డు రాలేదు. అమ్మాయి వేరే కులం అన్న ఆలోయన చేయలేదు. కానీ పెళ్లి అనేసరికి కులం అడ్డుగోడగా చూపాడు సునీల్. ఈమేరకు అమృత నిలదీసింది కూడా..
స్పందన లేకపోవడంతో..
ఎంత బతిమిలాడినా.. ప్రశ్నించినా.. నిలదీసినా.. బాధపడినా.. ప్రేమికుడి మనసు కరుగలేదు. పెళ్లికి ససేమిరా అన్నాడు. దీంతో మనస్తాపం చెందిన అమృత ఆత్మహత్య చేసుకుంది. అయితే కొన ఊపిరితో ఉన్న ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా.. నాలుగు రోజులు మృత్యువుతో పోరాడి ఓడిపోయింది. ఆమె రాసిన లేఖ పోలీసులకు దొరికింది. ప్రేమ పేరుతో తనను సునీల్ లొంగదీసుకున్నాడని, ఇప్పుడు కులం తక్కువ అంటూ పెళ్లికి నిరాకరించాడంటూ అందులో పేర్కొంది. అతడి కుటుంబ సభ్యులు కూడా అవమానించారంటూ పేర్కొంది. ఈ కేసులో సునీల్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. తదుపరి విచారణ చేపడుతున్నారు.
ప్రేమకు కులం లేదని..
ప్రేమించే టప్పుడు సునీల్.. అమృతకు ఎన్నో ఊసులు చెప్పాడు. ప్రేమకు కుల మత బేధం ఉండదని, అందరం మనుషులమే అని భాసలు చేశాడు. ఊసులు చెప్పాడు. జీవితాంతం కలిసే ఉందామని, ఉంటామని నమ్మించాడు. ఈ మాటలకు కరిగిపోయిన అమృత సర్వం సమర్పించుకుంది. కానీ, పెళ్లి అనే విషయంలో మాత్రం ఆ ఊసులు, భాసలు మర్చిపోయాడు. అవసరం కోసమే అవన్నీ చెప్పానన్నట్లు తప్పించుకున్నాడు. ఈ మోసాన్నే అమృత తట్టుకోలేక తనువు చాలించింది. ఇలాంటి వారెందరో సమాజంలో ఉన్నారు. క్షణిక సుఖం, బలహీనతను జయిస్తే.. ఇలాంటి యువకుల బారిన పడకుండా కాపాడుకోవచ్చు.