
Shani Dev: మనకు జాతకంలో ప్రతికూల ప్రభావాలు వస్తున్నాయంటే శనిదేవుడి వల్లే అని అనుకుంటారు. కానీ అందులో నిజం లేదు. శని చెడు ఫలితాలు ఇచ్చే వాడని చెబుతారు. కానీ శని మన జాతకంలో మంచి స్థానంలో ఉంటే మనకు మంచి ఫలితాలే వస్తాయి. వక్ర స్థానంలో ఉంటే ప్రతికూల ప్రభావాలు రావడం సహజమే. ఈ నేపథ్యంలో ప్రతి పనికి మనకు శని అడ్డుపడుతున్నాడని అనుకుంటారు. కానీ శని వల్ల మనకు ఎన్నో మంచి పనులు జరుగుతాయనే విషయం చాలా మందికి తెలియదు.
రాశిలో శని మంచిస్థానంలో ఉంటే వారికి అనుకూల ఫలితాలే ఇస్తాడు. వారి జీవితం ప్రశాంతంగానే సాగుతుంది. చెడు స్థానంలో ఉంటే మాత్రం ప్రతికూల ఫలితాలు చూపిస్తాడు. ఈ నేపథ్యంలో శని దేవుడిని ప్రసన్నం చేసుకునేందుకు పరిహారాలు పాటిస్తే సరిపోతుంది. మంచి ఫలితాలు రావడానికి ఆస్కారం ఏర్పడుతుంది. ఇలా శని మన జాతకంలో మంచి, చెడు ఫలితాలు ఇవ్వడానికి అతడు ఉన్న స్థానమే ప్రధానం అవుతుంది.
శని దేవుడిని ప్రసన్నం చేసుకోవాలంటే శనివారం నల్లటి వస్త్రాలు ధరించాలి. నువ్వుల నూనెతో శనికి అభిషేకం చేయించాలి. నల్లటి ఉత్తరీయం శనికి కప్పి వేడుకోవాలి. దీంతో శని మనకు ప్రతికూల ప్రభావాలకు బదులు అనుకూల ప్రభావాలు కలిగిస్తాడు. శని దేవుడిని సంతోషపెట్టాలంటే శనివారం కొన్ని ఆహారాలు కూడా తీసుకోకూడదు. అవి తీసుకుంటే శనికి కోపం వస్తుంది.

శనివారం పప్పులకు దూరంగా ఉండాలి. ఎండు మిరపకాయలు తినకూడదు. వాటిని వంటలో వాడకూడదు. శనివారం కాల్చిన వంకాయ కూర తినకూడదు. గోధుమ రవ్వతో చేసిన పదార్థాలను కూడా తినొద్దు. ఆవనూనెను కూడా కూరల్లో వేయరాదు. ఈ పదార్థాలు తింటే శనికి ఆగ్రహం వస్తుందట. అందుకే వాటికి దూరంగా ఉండటమే శ్రేయస్కరం.
శనివారం మిరియాలు, పెసరపప్పు, సొరకాయ, బీరకాయలు మాత్రం తినొచ్చు. పన్నీరు కూడా వాడొచ్చు. కానీ జ్యేష్ట, భాద్రపద మాసాల్లో శనివారాలు సొరకాయ, బీరకాయలు తినకూడదు. ఇలాంటి పరిహారాలు పాటిస్తే శని ప్రభావం మన మీద చెడు కాకుండా మంచి కలిగిస్తాడని నమ్ముతుంటారు. శని దేవుడి ప్రసన్నం కోసం వాటిని తినకుండా ఉంటేనే మంచిది.