
Ghost Forest: పర్యావరణ ప్రభావంతో వాతావరణంలో భారీగా మార్పులు వస్తున్నాయి. అడవులు అంతరిస్తున్నాయి. సముద్ర మట్టం పెరగడంతో నీరంతా అడవుల్లోకి వెళ్లడంతో చెట్లు చనిపోతున్నాయి. ఫలితంగా అటవీ సంపద నశిస్తోంది. దీనిపై పర్యావరణ వేత్తలు ఆందోళన చెందుతున్నా దిద్దుబాటు చర్యలు తీసుకోవడం లేదు. ఈ నేపథ్యంలో అమెరికాలోని చాలా ప్రాంతాల్లో దెయ్యాల అడవులు దర్శనమిస్తున్నాయి.
తీరప్రాంత అడవులన్ని శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. సముద్ర మట్టాలు వేగంగా అంతరిస్తున్నాయి. సముద్ర మట్టాలు పెరగడంతో ఉప్పు నీరు అడవులను ముంచెత్తుతున్నాయి. ఫలితంగా చెట్లు చనిపోతున్నాయి. అడవుల్లోని పచ్చని చెట్లను ఉప్పు నీరు కబళిస్తోంది. దీంతో అడవులు శ్మశాన వాటికలుగా మారుతున్నాయి. ఎటు చూసినా శవాల దిబ్బలుగా కనిపిస్తున్నాయి.

ఈస్ట్ కోస్ట్ లో ఇలాంటి దెయ్యాల అడవులు ఎక్కువగా కనిపిస్తాయి. ప్రతి సంవత్సరం 15 అడుగుల మేర సముద్రపు నీరు అడవుల్లోకి వస్తోంది. దీని వల్ల పచ్చని చెట్లు చనిపోతున్నాయి. చెట్లు చనిపోయిన తరువాత వాటి మొదళ్లు సమాధులుగా కనిపిస్తున్నాయి. సముద్రపు నీరు వల్ల నగరాలు, భూమి మునిగిపోవడమే చూస్తున్నాం. వాటి వల్ల అనేక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి.
అడవులు అంతరించిపోతుంటే దానిపై ఎవరు ఫోకస్ పెట్టడం లేదు. భవిష్యత్ లో ఇలాగే కొనసాగితే అడవుల విస్తీర్ణం బాగా తగ్గనుంది. దీనిపై ఇప్పటికే పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నా పట్టించుకోవడం లేదు. వేలాది ఎకరాల అడవులు కనుమరుగవుతున్నాయి. తుఫానులు, సునామీల వల్ల కూడా అడవులకు ముప్పు ఏర్పడుతోంది. దెయ్యాల దిబ్బలుగా మారుతున్న అడవులు ప్రమాదకరంగా మారుతున్నాయి. సముద్రపు నీరు రానంత దూరంలో అడవులను పెంచితేనే ప్రయోజనం ఉంటుందని పర్యావరణ వేత్తలు సూచిస్తున్నారు.