
Baby Shamili: 1990లల్లో చైల్డ్ ఆర్టిస్టులను బేస్ చేసుకొని చాలా సినిమాలు వచ్చేవి. ఈ సినిమాల్లో ఓ పాప క్యూట్ స్మెల్ తో అలరించేది. లోకం గురించి పూర్తిగా తెలియని వయసులోనే ఆమె సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆమె నటనే కాదు పేరు కూడా పాపులర్ అయింది. ఆమె ఎవరో కాదు బేబీ షామిలి. అప్పట్లో బేబీ షామిలీ సినిమాలో ఉందంటే ఆ సినిమా హిట్టు అని కొందరు అనుకునేవారు. జగదేకవీరుడు అతిలోక సుందరి, మాయలోడు తదితర బ్లాక్ బస్టర్ సినిమాల్లో నటించిన ఈ క్యూట్ బేబీ ఆ తరువాత ఒక్కసారిగా సినిమాల నుంచి తప్పుకుంది. చిన్న వయసులోనే 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈమె హీరోయిన్ గా రాణించలేకపోయింది. దీంతో ఆమె సినిమాల నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ బేబీ షామిలీ మరి ఏంచేస్తున్నట్లు? ఎక్కడున్నట్లు?
బేబీ షామిలి గురించి నేటి కుర్రాళ్లకు సైతం తెలుసు. కానీ చిన్నవయసులో ఉన్న హవా ఆమెకు పెద్దయ్యాక గుర్తింపు రాలేదు. చాలా మంది చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన వాళ్లు పెద్దయ్యాక హీరోయిన్ గా రాణిస్తున్నారు. వీరిలో కొందరు స్టార్లు అయ్యారు..మరికొందరు కలిసిరాక మధ్యలోనే తప్పుకున్నారు. బేబీ షామిలి చిన్నప్పుడు బేబీ స్టార్ గా కొనసాగారు. ఆ గుర్తింపుతో పెద్దయ్యాక ‘ఓయ్’ సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయ్యారు. అయితే ఈ సినిమాలో కాస్త బొద్దుగా ఉండడంతో యూత్ ను ఆకట్టుకోలేకపోయారు. చిన్నప్పటి అందం ఇప్పుడు ఆమెలో లేదని కొందరు పోస్టుల ద్వారా బయటపెట్టారు. దీంతో ఆమె బ్యూటీనెస్ పై ఫోకస్ పెట్టారు. ఆ తరువాత కొన్ని లేటేస్ట్ పిక్స్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. అయితే గ్లామర్ నెస్ సంపాదించుకున్నా అమ్మడుకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. దీంతో సినిమాలపై విరక్తి పుట్టి ఇండస్ట్రీలోకి రావడం మానేశారు.

అయితే సినిమాల్లోకి రాముందే బేబీ షామిలికి పెయింట్ అంటే చాలా ఇష్టం. సినిమాల్లో అమెకు కలిసి రాకపోవడంతో దానిపైనే ఎక్కువగా దృష్టి పెట్టారు. ఇందులో ప్రావీణ్యం సంపాదించడానికి అమెరికాకు వెళ్లి ట్రైయినింగ్ కూడా తీసుకున్నారు. ప్రస్తుతం పలు చిత్రాలను గీసిన ఆమె సోషల్ మీడియాలో వాటిని ప్రదర్శిస్తున్నారు. అయితే సినిమాల్లోకి రావాలని కొందరు అడగగా.. మంచి పాత్ర దొరికితే వస్తానని.. కానీ సినిమాల కోసం ప్రత్యేకంగా ప్రయత్నించనని బేబి షామిలి అంటున్నారు.
ప్రస్తుతం చెన్నైలో నివసిస్తున్న ఆమె త్వరలో సొంతంగా పెయింటింగ్ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తానని అంటోంది. అయితే ఈమె ఓయ్ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినా ప్రస్తుతం హీరోయిన్ రేంజ్ లో ఆకర్షిస్తున్నారు. కొంతమంది డైరెక్టర్లు తమ సినిమాల కోసం ఆమెకు ఫోన్లు చేస్తున్నారని అంటున్నారు. అయితే తనకు ఇష్టమైన పాత్ర దొరకడం లేదని సన్నిహితుల ద్వారా చెప్పడంతో చాలా మంది సోషల్ మీడియాలో ఆ విషయాన్ని బయటపెడుతున్నారు.