Singer Dhi: చమ్కీల అంగీలేసి’ సింగర్ ‘ధీ’ గురించి ఈ ఆసక్తికర విషయాలు తెలుసా?

Singer Dhi : ఇప్పుడెక్కడ చూసిన ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె’ అనే సాంగ్ వినిపిస్తోంది. ‘దసరా’ సినిమాలోని ఈ సాంగ్ లో కీర్తి సురేష్ చేసిన డ్యాన్స్ ను అందరూ మెచ్చుకున్నారు.. ఈ సాంగ్ తో రకరకాల మీమ్స్ కూడా తయారు చేశారు.. కానీ ఇంతటీ ఊపు తెచ్చిన సింగర్ ‘ధీ’ గురించి మాత్రం తక్కువ చర్చ సాగుతోంది. ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ పాడిన ‘ధీ’ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె పాడిన పాటలు […]

Written By: Srinivas, Updated On : April 2, 2023 11:24 am
Follow us on

Singer Dhi : ఇప్పుడెక్కడ చూసిన ‘చమ్కీల అంగీలేసి ఓ వదినె’ అనే సాంగ్ వినిపిస్తోంది. ‘దసరా’ సినిమాలోని ఈ సాంగ్ లో కీర్తి సురేష్ చేసిన డ్యాన్స్ ను అందరూ మెచ్చుకున్నారు.. ఈ సాంగ్ తో రకరకాల మీమ్స్ కూడా తయారు చేశారు.. కానీ ఇంతటీ ఊపు తెచ్చిన సింగర్ ‘ధీ’ గురించి మాత్రం తక్కువ చర్చ సాగుతోంది. ‘చమ్కీల అంగిలేసి’ సాంగ్ పాడిన ‘ధీ’ చాలా మందికి తెలియకపోవచ్చు. కానీ ఆమె పాడిన పాటలు తెలిస్తే మాత్రం ఆశ్చర్యపోక మానరు. వెంకటేశ్ నటించిన ‘గురు’ సినిమాలోని ‘ఓ సక్కనోడా..’, సూర్య నటించిన ‘ఆకాశమే హద్దురా’లోని ‘కాటుక కనులే’ అనే పాటలతో అప్పుడే స్టార్ అయ్యారు. అయితే ఆమెకు ‘చమ్కీల’ సాంగ్ తో మరింత పాపులారిటీ వచ్చిందని ఆమె చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమె పర్సనల్ లైఫ్ గురించి ఆమె చెప్పిన కొన్ని ఆసక్తికర విషయాలు మీకోసం..

‘ధీ’ పూర్తి పేరు.. దీక్షితా వెంకటేశన్.. కానీ అందరికీ ‘ధీ’గా పరిచయం. వీళ్ల కుటుంబం శ్రీలంక తమిళులకు చెందిన వారు. కానీ ధీ పుట్టింది మాత్రం సిడ్నీలో. అయితే ధీ వాళ్ల అమ్మమ్మ కర్ణాటక సంగీతంలో ప్రావీణ్యురాలు. ఆమె తల్లి మీనాక్షి అయ్యర్ కూడా సంగీతం నేర్పించేంది. అయితే వాళ్ల లాగా ధీ సంగీతం నేర్చుకోలేదు. కానీ వారి పాటలను శ్రద్ధగా వినేది. ఆ తరువాత తన పదిహేనవ సంవత్సరంలో వాళ్ల నాన్న ‘పిజ్జా2’లో ‘డిస్కో ఉమన్’ అనే పాటను పాడించారు. అప్పటి నుంచి సంగీతంపై మక్కువ ఏర్పడిందని ఆమె చెప్పారు.

దీక్షిత్ వెంకటేషన్ నాన్న చిన్నప్పుడే చనిపోయారు. వాళ్ల అమ్మ వేరే వ్యక్తి సంతోష్ నారాయణన్ ను పెళ్లి చేసుకున్నారు. ఆయన సినిమా డైరెక్టర్. అయితే నారాయణన్ ‘ధీ’ని సొంత కూతురులా చూసుకునేవారని అమె అంటున్నారు. అలాగని ఆయన అండతో సినిమాల్లో పాటలు పాడలేదని, ఎక్కడా తన అవసరం ఉంటుందో అక్కడ చెప్పేవాడని అంటున్నారు. ఇలా ఎన్నో సినిమాల్లో పాటలు పాడినా గుర్తింపు రాలేదు. కానీ గురు సినిమాలోని ‘ఓ సక్కనోడా’ అనే సాంగ్ తో ఫేమస్ అయ్యానని చెప్పారు. ఈ సాంగ్ పాడేందుకు అవకాశం ఇచ్చిన సుధా గారికి ఎప్పుడు రుణపడి ఉంటానని చెబుతున్నారు. ఆ తరువాత సూర్య హీరోగా నటించిన ‘ఆకాశమే హద్దురా’ సినిమాలోని ‘కాటుక కనులే’ అనే పాట పాడే అవకాశం కూడా ఆమెను ఇవ్వడం మరింత ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు.

ఇక ‘దసరా’ సినిమాలో తెలంగాణ యాసలో పాడడం కొంచెం కష్టంగానే అనిపించింది. కానీ ఈ సాంగ్ తో ఇంత పాపులారిటీ వస్తుందని అస్సలు ఊహించలేదని ధీ అంటున్నారు. ఇవే కాకుండా అంతకుముందు మారి2 లోని ‘రౌడీ బేబీ’ సాంగ్ మీకందరికి తెలిసిన విషయమే అని అంటున్నారు. పాటలు పాడడమే కాకుండా దుస్తుల్ని డిజైన్ చేయడం, రాయడం కూడా తెలుసునని అమె చెబుతున్నారు. తనకు ఎమ్మెస్ సుబ్బలక్ష్మి, పీబీ శ్రీనివాస్ ల గానం అంటే చాలా ఇష్టమని చెబుతోంది. ఒకవేళ తాను గాయని కాకుంటే కళలకు సంబంధించి ఏదో ఒక రంగంలో స్థిరపడేదానిని ‘ధీ’ చెబుతున్నారు.