
Trivikram Assets: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాలంటే లైక్ చేయని వారుండరు. ఆయన సినిమాల్లో ఉండే పంచ్ డైలాగ్ లు సినీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. మొదట్లో డైలాగ్స్ రచయితగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి ఆకట్టుకున్న ఆయన పలు సినిమాలకు మాటలు రాసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన డైలాగ్స్ రాసిన సినిమాల్లో సక్సెస్ అయినవే ఎక్కువగా ఉన్నాయి. ఆ తరువాత డైరెక్టర్ గా మారి ఎన్నో విజయవంతమైన చిత్రాలు కూడా అందించారు. పవన్ కల్యాణ్ తో పలు సినిమాలు తీసిన త్రివిక్రమ్ అంటే మెగా ఫ్యాన్స్ చాలా ఇష్టపడుతారు. చివరగా త్రివిక్రమ్ పర్యవేక్షణలో వచ్చిన భీమ్లానాయక్ తో ఇప్పటికీ ఫ్యాన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సినిమా తీసే పనిలో ఉన్నారు. ఈ సందర్భంగా త్రివిక్రమ్ ఆస్తులపై ఇండస్ట్రీలో ఆసక్తిగా చర్చ సాగుతోంది. ఆయన ఒక్కో సినిమాకు ఎంత తీసుకుంటున్నారు? మొత్తంగా ఆయన సంపాదన ఎంత? అని చర్చించుకుంటున్నారు.
చిరునవ్వుతో, నువ్వునాకు నచ్చావ్, నువ్వే నువ్వే సినిమాల్లో కథ కంటే పంచ్ డైలాగ్స్ విపరీతంగా ఆకట్టుకుంటాయి. అందుకు కారణం మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ చేతి నుంచి జాలువారిన పదాలే అని చెప్పవచ్చు. ఆయన రాసిన ఒక్కో డైలాగ్ లో పరామర్థం ఉండడంతో పాటు కామెడీని పుట్టిస్తుంది. అలా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న త్రివిక్రమ్ మహేశ్ బాబుతో ‘అతడు’ తీసి డైరెక్టర్ గా మారాడు. మొదటి సినిమానే బ్లాక్ బస్టర్ కావడంతో ఆయన సక్సెస్ కు బ్రేక్ కాలేదు. ఆ తరువాత పవన్ కల్యాణ్ తో జల్సా, అత్తారింటికి దారేదీ తీసి బ్లాక్ బస్టర్ కొట్టాడు.
ప్రస్తుతం మహేశ్ బాబుతో ఓ సినిమా తీస్తున్నాడు. ఈ తరుణంలో త్రివిక్రమ్ ఒక్కో సినిమాకు డైరెక్టర్ గా పనిచేసినందుకు రూ.20 కోట్లు తీసుకుంటాడని టాక్. ప్రస్తుతం మహేశ్ బాబు సినిమాకు రూ.22 కోట్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడట. ఇలా ఆయన సంపాదించిన ఆస్తులు మొత్తంగా రూ.140 కోట్ల వరకు ఉంటుందని తెలుస్తోంది. వీటిలో త్రివిక్రమ్ కు 3 లగ్జరీ కార్లు ఉన్నాయి వీటి విలువ ఒక్కోటి రూ. 5 నుంచి 6 కోట్ల వరకు ఉంటుంది. బంజారా హిల్స్ లో రూ.18 కోట్ల విలువ చేసే ఇల్లు ఉంది. ప్రస్తుతం ఆయన తన కుటుంబ సభ్యులతో ఇక్కడే నివసిస్తున్నారు.

మిడిల్ క్లాస్ నుంచి ఎదిగిన త్రివిక్రమ్ ఒక్కో మెట్టు ఎదుగుతూ టాప్ డైరెక్టర్ అయ్యారు. పోసాని కృష్ణ మురళి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన ఆయనతో సినిమాలు చేయడానికి కొంతమంది హీరోలు క్యూ కడుతున్నారు. సినిమాలకు మాటలు రాయడంలో ఘనాపాటి అనిపించుకుని.. సినిమాలు తీయడంలోనూ తనకు తానే సాటి అని అనిపించుకుంటున్నారు. త్రివిక్రమ్ సినిమాలు ప్రత్యేకంగా ఉంటాయన్నట్లుగా ఆయన డైరెక్షన్ ఉంటుంది.