
Chammak Chandra- Satyashri: జబర్దస్త్ ప్రొగ్రాం ఎంతో మందికి జీవితాన్నిచ్చింది. వీరిలో చమ్మక్ చంద్ర ఒకరు. ఎక్కువగా ఫ్యామిలీ స్కిట్లు చేసే చమ్మక్ చంద్రకు ప్రత్యేకంగా అభిమానులు ఉన్నారు. ముఖ్యంగా భార్య బాధితులు చమ్మక్ చంద్ర వీడియోలు ఎక్కువగా చూస్తారని అంటుంటారు. చంద్ర టీం లో ఆయనతో పాటు సత్యశ్రీ కి కూడా గుర్తింపు వచ్చింది. కొన్నాళ్లు చంద్రతో లేడీ గెటప్ లు వేసి నటించగా.. సత్యశ్రీ అనే అమ్మాయి నేరుగా యాక్ట్ చేసింది. చమ్మక్ చంద్ర, సత్యశ్రీలు కలిసి భార్యభర్తల స్కిట్లు చేయడంతో వీరు రియల్ లైఫ్ లో కూడా వైఫ్ అండ్ హస్బెండా అని అనుకున్నారు. కానీ ఆ తరువాత పలు ఇంటర్వ్యూలు, కథనాల ద్వారా వేర్వేరు అని తేలింది. కానీ వీరిద్దరిపై అనేక పుకార్లు వచ్చాయి. ఈ పుకార్లపై సత్యశ్రీ ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ సంచలన విషయాలను బయటపెట్టింది.
చమ్మక్ చంద్ర జబర్దస్త్ ను వీడిన తరువాత ఆయనతో పాటు సత్యశ్రీ కూడా ఇతర చానెల్ లోకి వెళ్లింది. అక్కడ వీరి షో సక్సెస్ కాకపోయినా పర్సనల్ గా వీరిద్దరి నటన ఆకట్టుకుంటుంది. దీంతో వీరు ఎక్కడున్నా ఫేవర్ జంట అని అభిమానులు అంటుంటారు. ఈ క్రమంలో కొందరు వీరిపై రకరకాల పోస్టులు పెట్టి వైరల్ చేశారు. వీరి మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారు. ఈ పోస్టుల ను చూసి సత్య శ్రీ తల్లిదండ్రులు సైతం ఆమెను అనుమానించారట. కానీ ఆ తరువాత సత్యశ్రీ వాళ్లకు వివరించి చెప్పడంతో రిలాక్స్ అయ్యారట.
ఈ నేపథ్యంలో ఆమె ఓ చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు సంచలన విషయాలను బయటపెట్టారు. తనకు చమ్మక్ చంద్ర గురువు లాంటి వారని అన్నారు. తనకు ఆయన అవకాశం ఇవ్వడం ద్వారానే పాపులర్ అయ్యానని అన్నారు. అలాంటి గురు శిష్యుల మధ్య లేని పోని అపోహాలు సృష్టించొద్దన్నారు. మా తల్లి దండ్రులు కూడా ఇలాగే డౌట్ పడితే వారికి తాము గురు శిష్యులం మాత్రమే అని చెప్పానన్నారు. ఇక తాను జబర్తస్త్ ను వీడడానికి ప్రత్యేకంగా వ్యక్తిగత కారణాలు ఏమీ లేవని తెలిపింది. మా గురువు ఎక్కడుంటారో.. నేను అక్కడే పనిచేస్తానని వివరించింది.

సత్యశ్రీ తన గురువు చమ్మక్ చంద్ర గురించి క్లారిటీ ఇవ్వడంతో సోషల్ మీడియాలో వీరి గురించి చర్చ ప్రారంభమైంది. కొందరు పనిలేనివాళ్లే ఇలాంటి కామెంట్లు చేస్తారని, మీరు పట్టించుకోవద్దని సత్యశ్రీకి సపోర్టుగా నిలుస్తున్నారు. కళాశాలలో చదువుకునే రోజుల్లోనే సత్యశ్రీ జబర్దస్త్ ప్రొగ్రాంకు వచ్చారు. ఆ తరువాత చమ్మక్ చంద్ర టీంలో కొనసాగి పాపులర్ అయ్యారు. ఆ తరువాత ఆయనతో కలిసి జీ తెలుగు చానెల్ లోకి వెళ్లారు.