
Chammak Chandra Assets: ఈటీవీ లో ప్రసారమయ్యే జబర్దస్త్ అనే కామెడీ షో ద్వారా నేడు టాలీవుడ్ లోకి ఎంతో మంది అడుగుపెట్టి స్టార్ కమెడియన్స్ గా ఎదిగారు. ఎంతో మందికి జీవితాన్ని ఇచ్చింది ఈ బిగ్గెస్ట్ కామెడీ షో.ముఖ్యంగా చమ్మక్ చంద్ర ఈ షో ద్వారా ఎంత ఫేమస్ అయ్యాడో మన అందరికీ తెలిసిందే. డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో, సరికొత్త మ్యానరిజమ్స్ తో లక్షలాది మంది అభిమానులను సొంతం చేసుకున్నాడు ఆయన.
జబర్దస్త్ షో ద్వారా మంచి క్రేజ్ రావడం తో చమ్మక్ చంద్ర కి సినిమాల్లో కూడా మంచి ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం ఆయన టాలీవుడ్ లో మంచి డిమాండ్ ఉన్న కమెడియన్స్ లో ఒకడు, పెద్ద హీరోల సినిమాల్లో కూడా అవకాశాలు వస్తున్నాయి. ఇండస్ట్రీ లోకి వచ్చిన కొత్తల్లో కనీసం తినడానికి కూడా డబ్బులు ఉండేవి కాదట,అలాంటి సమయం లో జబర్దస్త్ కామెడీ షో ఒక వరం లాగ దక్కింది అని, ఈ షో లేకపోతే నాకు కెరీర్ లేదని చమ్మక్ చంద్ర ఎన్నో సందర్భాలలో చెప్పి ఉన్నాడు.
జబర్దస్త్ లో ఉన్నన్ని రోజులు అందరికంటే ఎక్కువ రెమ్యూనరేషన్ తీసుకునేది చమ్మక్ చంద్ర టీం అట.ఒక్కో స్కిట్ కి ఆయన 5 లక్షల రూపాయిలు తీసుకునేవాడట. ఆ తర్వాత జబర్దస్త్ షో వదిలి జీ తెలుగు లో ‘అదిరింది’ అనే షో లో పాల్గొన్నాడు.అక్కడ కూడా ఆయనకీ భారీ స్థాయిలోనే రెమ్యూనరేషన్ ముట్టేది. అలా చమ్మక్ చంద్ర ఈ పదేళ్లలో బాగా సంపాదించాడట, మణికొండ లో ఈయనకి సొంత ఇల్లు కూడా ఉంది.

అలాగే హైదరాబాద్ లో అనే ప్రాంతాలలో ఆలయానికి భూములు కూడా ఉన్నాయట. వీటి విలువ మొత్తం కలిపి సుమారు గా 50 కోట్ల రూపాయిల వరకు ఉంటుందని అంచనా. ఒక మీడియం రేంజ్ హీరో కి ఎంత ఆస్తులు అయితే ఉంటాయో, అంత ఆస్తులు చమ్మక్ చంద్ర కి ఉండడం విశేషం. ప్రస్తుతం సినిమాల్లో బిజీ గా ఉన్న చమ్మక్ చంద్ర రాబొయ్యే రోజుల్లో ఇంకెన్ని ఉన్నత శిఖరాలను అధిరోహిస్తాడో చూడాలి.