https://oktelugu.com/

Apple Store: ముంబైలో ప్రారంభించే ‘యాపిల్ స్టోర్’ ప్రత్యేకతలేంటో తెలుసా?

Apple Store: ఐటీ మేటి దిగ్గజం ‘యాపిల్’ భారత్ భూభాగాన అడుగుపెడుతోంది. ప్రపంచవ్యాప్తగా ప్రసిద్ధి గాంచిన ఈ కంపెనీ స్టోర్ ను భారత్ లో లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. యాపిల్ స్టోర్ ను దేశంలో ప్రారంభించడం ద్వారా తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. భారత్ లో యాపిల్ అడుగుపెట్టి 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ స్టోర్ ను ఏప్రిల్ 18న ముంబైలో […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 18, 2023 / 08:59 AM IST
    Follow us on

    Apple Store

    Apple Store: ఐటీ మేటి దిగ్గజం ‘యాపిల్’ భారత్ భూభాగాన అడుగుపెడుతోంది. ప్రపంచవ్యాప్తగా ప్రసిద్ధి గాంచిన ఈ కంపెనీ స్టోర్ ను భారత్ లో లాంచ్ చేయనున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశారు. యాపిల్ స్టోర్ ను దేశంలో ప్రారంభించడం ద్వారా తన మార్కెట్ ను మరింత విస్తరించుకోవచ్చని ఆ సంస్థ భావిస్తోంది. భారత్ లో యాపిల్ అడుగుపెట్టి 25 సంవత్సరాల పూర్తి చేసుకున్న సందర్భంగా ఇక్కడ స్టోర్ ను ఏప్రిల్ 18న ముంబైలో ప్రారంభిస్తున్నట్లు ఈ స్టోర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ టిమ్ కుమ్ తెలిపారు. అద్భుతమైన సాంప్రదాయాలు కలిగిన భారత్ లో స్టోర్ ను ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యాపిల్ స్టోర్ ప్రత్యేకతలేంటో తెలుసుకుందాం.

    దేశ ఆర్థిక రాజధాని ముంబైలోని బీకేసీ బిజినెస్ డిస్ట్రిక్ లో యాపిల్ స్టోర్ ను ఏర్పాటు చేస్తున్నారు. 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అంతస్థుల భవనంలో పలు ప్రత్యేకతలతో తీర్చిదిద్దారు. 100 మంది సిబ్బంది ఈ స్టోర్ లో ఒకేసారి విధులు నిర్వహించవచ్చు. అంతేకాకుండా ఇక్కడ పనిచేసే సిబ్బంది భారతదేశంలోని 18 భాషలు మాట్లాడేవారు ఉంటారు. వీరిలో సగం మంది మహిళా ఉద్యోగులు ఉంటారు. యాపిల్ కు సంబంధించిన అన్ని ఉత్పత్తులను రిపేర్ చేయడానికి అనువైన టెక్నాలజీని అందుబాటులో ఉంచినట్లు యాపిల్ సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ డెడ్రీ ఓ బ్రెయిన్ తెలిపారు.

    ముంబై లాంచింగ్ తరువాత ఏప్రిల్ 20న మరో స్టోర్ ను ఢిల్లీలో ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరవుతారని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. యాపిల్ సంస్థకు భారత్ తో దీర్ఘకాలికంగా అనుబంధం ఉంది. ఆ నేపథ్యంలో భారత మార్కెట్లలో ఐ ఫోన్ ను మరింత విస్తరించేందుకు సత్సంబంధాలు నెలకొంటామని వారు పేర్కొంటున్నారు. భారత్ లో పెట్టుబడులు పెట్టడం, మానవాళికి సేవ చేసే ఆవిష్కరణలతో మెరుగైన భవిష్యత్ ను నిర్మిస్తామని అంటున్నారు.

    Apple Store

    చైనాలో కొవిడ్ తో పాటు ఆర్థిక పరమైన చిక్కులు ఏర్పడడంతో యాపిల్ భారత్ వైపు మళ్లింది. 2017 నుంచి ఐఫోన్ల తయారీని భారత్ లో చేపట్టింది. 2022-23 ఆర్థిక సంవత్సరంలో సుమారు 5 బిలియన్ల డాలర్ల విలువైన యాపిల్ ఎగుమతులు భారత్ నుంచే ఎగుమతి కావడం విశేషం. ఈ నేపథ్యంలో భారత్ లో స్టోర్లు నెలకొల్పడం, కొత్త పర్యావరణ హిత కార్యక్రమాలు చేపట్టడం కీలక మైలురాయి అని ఆ కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు.