
Sai Pallavi On Pushpa 2: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ తెరకెక్కుతున్న పుష్ప 2 సినిమా కోసం ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ మొత్తం ఎంత ఆతృతగా ఎదురు చూస్తుందో మన అందరికి తెలిసిందే.పుష్ప పార్ట్ 1 అంచనాలకు మించి బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతాలు సృష్టించడం తో, పార్ట్ 2 అభిమానుల్లో మరియు ప్రేక్షకుల్లో ఉన్న అంచనాలకు మించి ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.పార్ట్ 2 మొత్తం అల్లు అర్జున్ మరియు ఫహద్ ఫాజిల్ మధ్యనే వార్ ఉంటుంది అనేది మనకి అర్థం అయ్యింది.
కానీ ఈ సినిమా మధ్యలో వచ్చే ట్విస్టులు ఆడియన్స్ మైండ్ బ్లాక్ అయ్యేలా ఉంటుందట.రోజు రోజుకి సరికొత్త అప్డేట్ తో అభిమానులకు పిచ్చెక్కిస్తున్న పుష్ప 2 నుండి ఇప్పుడు లేటెస్ట్ గా మరో వార్త ఇంటర్నెట్ ని షేక్ చేస్తుంది.అదేమిటి అంటే ఈ సినిమాలో ప్రముఖ హీరోయిన్ సాయి పల్లవి ఒక ముఖ్య పాత్ర పోషించబోతుందట.
ఇటీవలే డైరెక్టర్ సుకుమార్ ఆమెని కలిసి కథ న్యారేట్ చేసి ఆమె పాత్ర తీరు ఎలా ఉండబోతుందో చెప్పాడట.ఇన్ని రోజులు ఆమె ఎలాంటి క్యారక్టర్ కోసం ఎదురు చూసిందో అలాంటి క్యారక్టర్ చెప్పేలోపు వెంటనే క్షణం కూడా ఆలోచించకుండా ఓకే చెప్పేసిందట సాయి పల్లవి.ఇందులో ఆమెది కాస్త నెగటివ్ టచ్ ఉన్న క్యారక్టర్ అట.

సాయి పల్లవి ఎంత అద్భుతమైన నటి అనేది మన అందరికి తెలిసిందే, గొప్ప డ్యాన్సర్ కూడా, ఇలా హీరో ని డామినేట్ చేసే పాత్రలు ఇస్తే, ఆమె అల్లు అర్జున్ ని కూడా డామినేట్ చేసే ప్రమాదం ఉంది, కాబట్టి సాయి పల్లవి తో కలిసి నటించేటప్పుడు కాస్త అప్రమత్తంగా ఉండాలని అల్లు అర్జున్ ని హెచ్చరిస్తున్నారు విశ్లేషకులు.ఇప్పటికే ఈ సినిమా రష్మిక ఉన్న సంగతి అందరికీ తెలిసిందే.ఆమె పాత్ర నిడివి ఈ చిత్రం లో చాలా తక్కువ ఉంటుందని సమాచారం.