
Sye Movie On Venu Madhav: కొన్ని సినిమాల పేర్లు తీస్తే మన కళ్ళ ముందు కొన్ని క్యారెక్టర్స్ ఫ్లాష్ అవుతాయి..వాటిని మనం ఎప్పటికీ మరచిపోలేము,అలా దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘సై’ సినిమా పేరు ఎత్తితే మనషి గుర్తుకు వచ్చే రెండు మూడు క్యారెక్టర్స్ లో ఒకటి వేణు మాధవ్ పోషించిన ‘నల్లబాలు’ అనే కామెడీ క్యారక్టర్.ఆరోజుల్లో ఈ పాత్ర సినిమాకి పెద్ద హైలైట్ అయ్యింది.ప్రేక్షకుల చేత కడుపుబ్బా నవ్వించేలా చేసింది,సినిమా మొత్తం మీద మూడు సార్లు ఈ పాత్ర వచ్చి పోతుంది.
అలా మూడు సార్లు వచ్చిపోవడానికి చాలా పెద్ద కథే ఉందట.తొలుత ఈ సినిమాలో ఆ పాత్రకి కేవలం ఒక్క సన్నివేశాన్ని మాత్రమే రాసాడట రాజమౌళి.కానీ వేణు మాధవ్ దానిని ఇంప్రొవైజ్ చేసి ఇలా చేస్తే అద్భుతంగా ఉంటుంది సినిమాకి హైలైట్ అవుతుంది అని రాజమౌళి ని ఒప్పించి అప్పటికప్పుడు స్పాట్ లో తన సొంతం గా ఆ సన్నివేశాన్ని పొడిగించాడట వేణు మాధవ్.
కానీ రాజమౌళి ఒక్కసారి పేపర్ మీద పెన్ పెట్టి స్క్రిప్ట్ ఫైనల్ చేసాడంటే, మక్కికి మక్కి దింపాల్సిందే, మధ్యలో ఒక సన్నివేశం తగ్గినా , ఒక సన్నివేశం జతపర్చిన ఒప్పుకోడు.కానీ ఆయన కథకి అవసరం కచ్చితంగా అనుకుంటే మాత్రం సలహాలు తీసుకుంటాడు, మార్పులు చేర్పులు చేస్తాడు.’నల్ల బాలు..నల్ల త్రాచు లెక్క’ అనే డైలాగ్ ని రాజమౌళినే రాసాడట.కానీ తర్వాత వేణు మాధవ్ దానికి ‘నాకి చంపేస్తా’ అని జత చేసి చెప్పడం తో రాజమౌళి పగలబడి నవ్వాడట.అలా సినిమాలో సందర్భానికి తగినట్టు మూడు చోట్ల వేణు మాధవ్ సన్నివేశాలను ఇరికించాడు రాజమౌళి.

అవి బాగా సెట్ అయ్యాయి కూడా.అయితే ఈ సన్నివేశాలకు వేణు మాధవ్ నే దర్శకత్వం వహించాడట.ఈ సినిమాలో మాత్రమే కాదు, ఛత్రపతి సినిమాలో కూడా వేణు మాధవ్ సన్నివేశాలను ఆయనే రాసుకొని, ఆయనే దర్శకత్వం వహించాడట.ఆరోజుల్లో వేణు మాధవ్ తన సన్నివేశాలకు తానే దర్శకత్వం వహించేవాడట.అలా చాలా సినిమాలే ఉన్నాయి.