
Ram Charan- Allu Arjun And NTR: గ్లోబల్ వైడ్ గా ఇప్పుడు మారుమోగిపోతున్న పేరు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.#RRR సినిమా తో ఆయన క్రేజ్ ఎవ్వరు ఊహలకు అందని రేంజ్ కి చేరుకుంది, అనకాపల్లి నుండి అమెరికా వరకు సినిమాని నచ్చే ప్రతీ ఒక్కడు రామ్ చరణ్ నటనకి ఫిదా అయిపోయారు.అవతార్ మరియు టైటానిక్ సిరీస్ ని తీసిన జేమ్స్ కెమరూన్ వంటి దిగ్గజం కూడా రామ్ చరణ్ నటన కి మంత్రముగ్దులు అయ్యాడంటే ఆయన రేంజ్ ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.
ఇప్పుడు పెద్ద పెద్ద స్టార్ డైరెక్టర్స్ అందరికీ రామ్ చరణ్ ఒక ఛాయస్ అయిపోయాడు.ఎందుకంటే ఎలాంటి రోల్ అయినా, ఎలాంటి గెటప్ కి అయినా రామ్ చరణ్ సెట్ అవుతాడు కాబట్టే.ఇప్పుడు రీసెంట్ గా వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టి బాలీవుడ్ కి పూర్వ వైభవం తెచ్చిన షారుఖ్ ఖాన్ వంటి వాడికి కూడా రామ్ చరణ్ సహాయం అవసరం పడింది.
షారుఖ్ ఖాన్ హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘జవాన్’ లో రామ్ చరణ్ ని ఒక ముఖ్య పాత్ర పోషించాల్సిందిగా ఆ చిత్ర దర్శకుడు అట్లీ ఇటీవలే రామ్ చరణ్ ని కలిసి కోరాడట.రామ్ చరణ్ అందుకు చాలా సానుకూలంగా స్పందించి ఓకే చెప్పేశాడట.షారుఖ్ ఖాన్ మొదటి నుండి రామ్ చరణ్ కి బెస్ట్ ఫ్రెండ్,పఠాన్ మూవీ ప్రొమోషన్స్ అప్పుడు కూడా రామ్ చరణ్ గురించి ప్రస్తావన వచ్చినప్పుడు చాలా గొప్పగా మాట్లాడుతాడు షారుఖ్ ఖాన్.ఆ స్నేహం వల్లే రామ్ చరణ్ ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాడట.ముందుగా ఈ పాత్ర కోసం అల్లు అర్జున్ ని సంప్రదించారట.

కానీ ఆయన ఎందుకో ఒప్పుకోలేదు, ఆ వెంటనే రామ్ చరణ్ ని సంప్రదించగా ఆయన వెంటనే ఒప్పేసుకున్నాడు.ఇలా అల్లు అర్జున్ కి వచ్చిన ఛాన్స్ ని రామ్ చరణ్ లాగేసుకున్నాడు అంటూ సోషల్ మీడియా లో ట్రోల్స్ వస్తున్నాయి, అంతే కాదు ఎన్టీఆర్ – బుచ్చి బాబు స్క్రిప్ట్ ని కూడా రామ్ చరణ్ లాగేసుకున్నాడని, ఇలా రామ్ చరణ్ స్టార్ హీరోల అవకాశాలకు గండి గొడుతూ తిరుగులేని పాన్ ఇండియన్ స్టార్ గా అవతరించాడని ట్రేడ్ పండితులు చెప్తున్నారు.