
Keerthy Suresh Nani Remuneration: న్యాచురల్ స్టార్ నాని ఇప్పటి వరకు లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ చిత్రాల్లో నటించి మెప్పించారు. దీంతో నాని ఇక ఫ్యామిలీ హీరోనే అనుకున్నారు. కానీ తనలో కూడా మాస్ యాంగిల్ ఉందని నిరూపిస్తున్నారు. ఆయన ఊర మాస్ లెవల్లో నటించిన ‘దసరా’ మూవీ శ్రీరామనవవి సందర్భంగా థియేటర్లోకి వచ్చింది. ఈ సందర్భంగా సినిమా గురించి జోరుగా చర్చలు సాగుతున్నాయి. ఈ తరుణంలో నాని ఈ సినిమాకు ఎంత పారితోషికం తీసుకున్నాడు? అన్న చర్చ తీవ్రమైంది. ఈ యంగ్ హీరో నటించిన చివరి సినిమా ‘అంటే సుందరానికి..’. ఇందులో నటించినందుకు రూ.12 కోట్లు తీసుకున్నాడట. అయితే దసరా కు మాత్రం భారీగా రెమ్యూనరేషన్ పెంచారని సినీ ఇండస్ట్రీ వర్గాల టాక్.
శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ‘దసరా’ మూవీ మార్చి 30న థియేటర్లోకి వచ్చింది. శ్రీకాంత్ ఓదెల ఈ సినిమా ద్వారా డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. మొదటి సినిమాతోనే ఆయన ఇండస్ట్రీ వ్యాప్తంగా చర్చల్లోకి ఎక్కాడు. ఎందుకంటే సినిమాకు హైప్ తీసుకురావడంలో శ్రీకాంత్ తీవ్రంగా కృషి చేశాడని తెలుస్తోంది. ‘దసరా’కు సంబంధించిన ఫస్ట్ లుక్ తోనే సినిమాపై ఇంప్రెస్ కలిగింది. అప్పటి నుంచి సినిమాకు సంబంధించిన ఏ విషయమైనా హాట్ టాపిక్ గా మారింది.
ఈ సినిమా మ్యూజికల్ గా కూడా ఇప్పటికే హిట్ సాధించిందని చెప్పొచ్చు. సంతోష్ నారాయన్ మ్యూజిక్ డైరెక్షన్లో కాసర్ల శ్యామ్ రచించిన పాటలు అద్భుతంగా ఆకట్టుకుంటున్నాయి. వీటిలో ‘చమ్కీల అంగీలేసి’ సాంగ్ దుమ్ములేపుతోంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళంలోనూ ఈ సినిమాలను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ఆయా లాంగ్వేజెస్ లో సాంగ్స్ సక్సెస్ ను అందుకున్నాయి. దీంతో ఈ సినిమాపై మిగతా ఇండస్ట్రీల్లోనూ హోప్స్ పెరిగాయి.

బొగ్గు గనుల నేపథ్యంలో తీర్చిదిద్దిన ఈ సినిమాలో నాని డిఫరెంట్ లుక్ లో కనిపించాడు. నాని ఇందులో బొగ్గు దొంగగా కనిపిస్తాడని అనుకుంటున్నారు. ఇప్పటి వరకు లవ్ హీరోగా అందరినీ ఆకట్టుకున్న నాని మాస్ హీరోగా కూడా మెప్పించేందుకు రెడీ అయ్యాడు. అయితే ఇందుకోసం నాని భారీగానే రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు టాక్ .ఇప్పటి వరకు ఆయన రెమ్యూనరేషన్ రూ.12 కోట్లు కాగా.. ‘దసరా’ సినిమా కోసం ఆయన రూ.15 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తోంది. హీరోయిన్ కీర్తి సురేష్ రూ.2 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు చర్చ సాగుతోంది.