https://oktelugu.com/

Pawan Kalyan: OG షూటింగ్ లో పవన్ కళ్యాణ్ ధరించిన ఈ స్టైలిష్ హూడి ధర ఎంతో తెలిస్తే నోరెళ్లబెడుతారు

Pawan Kalyan: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నంత స్టైలిష్ గా ఏ హీరో ఉండదు అని చెప్పడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.ఖుషి కాలం నుండే ఆయన యూత్ కి ఎంతో దగ్గరయ్యే దుస్తులు మరియు స్టైలింగ్ ని పరిచయం చేసాడు.ఈయనని ఫాలో అవుతూ కోట్లాది మంది అభిమానులు అదే రకమైన కాస్ట్యూమ్స్ ని ధరించడం వంటివి చేసేవారు.ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ #OG రెగ్యులర్ షూటింగ్ పాల్గొన్నాడు, నేడు పవన్ కళ్యాణ్ […]

Written By:
  • Vicky
  • , Updated On : April 18, 2023 / 02:13 PM IST
    Follow us on

    Pawan Kalyan

    Pawan Kalyan: టాలీవుడ్ లో పవన్ కళ్యాణ్ ఉన్నంత స్టైలిష్ గా ఏ హీరో ఉండదు అని చెప్పడం లో ఎలాంటి అతి సయోక్తి లేదు.ఖుషి కాలం నుండే ఆయన యూత్ కి ఎంతో దగ్గరయ్యే దుస్తులు మరియు స్టైలింగ్ ని పరిచయం చేసాడు.ఈయనని ఫాలో అవుతూ కోట్లాది మంది అభిమానులు అదే రకమైన కాస్ట్యూమ్స్ ని ధరించడం వంటివి చేసేవారు.ఇప్పుడు రీసెంట్ గా పవన్ కళ్యాణ్ #OG రెగ్యులర్ షూటింగ్ పాల్గొన్నాడు,

    నేడు పవన్ కళ్యాణ్ షూటింగ్ లో పాల్గొన్నట్టు ఆయనకీ సంబంధించిన ఒక స్టైలిష్ ఫోటో ని సోషల్ మీడియా లో అప్లోడ్ చేసారు.ఈ ఫొటోలో పవన్ కళ్యాణ్ ధరించిన హూడీ ఇప్పుడు సోషల్ మీడియా లో హాట్ టాపిక్ గా మారింది.ఆయనకీ సంబంధించి ఏ చిన్న విషయాన్ని అయిన తెలుసుకోవడానికి ఆసక్తి చూపే అభిమానులు, ఈ హూడీ ఎక్కడ దొరుకుతుందో అని వెతకడం ప్రారంభించారు.

    ఈ హూడి అమెజాన్ మరియు ఫ్లిప్ కార్ట్ వంటి పాపులర్ ఈ కామర్స్ యాప్స్ లో అందుబాటులోనే ఉంది.అయితే ఇది ఇండియా లో ఉండదు,విదేశాల నుండి దిగుమతి అవ్వాలి.అలా షిప్పింగ్ చార్జీలతో కలిపి ఈ హూడీ ధర సుమారుగా 7 వేల రూపాయిలు అవుతుందని అంటున్నారు.చాలా మంది ఈ హూడీ ని కొనుగోలు చెయ్యడానికి క్యూ కట్టేస్తున్నారు.ఇక #OG షూటింగ్ విశేషాల్లోకి వెళ్తే ఇందులో పవన్ కళ్యాణ్ కి జోడిగా ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది.

    Pawan Kalyan

    ప్రస్తుతం ముంబై లో జరుగుతున్న షూటింగ్ లో పవన్ కళ్యాణ్ తో పాటుగా ప్రియాంక కూడా పాల్గొంటున్నట్టు సమాచారం.ఈ నెలాఖరు వరకు ఈ మొదటి షెడ్యూల్ ముంబై లో జరగనుంది.సినిమాలో వచ్చే కొన్ని కీలకమైన యాక్షన్ సన్నివేశాలను ఈ షెడ్యూల్ లో తెరకెక్కించనున్నాడు డైరెక్టర్ సుజిత్.పవన్ కళ్యాణ్ స్టార్ స్టేటస్ కి తగ్గ సినిమా పడుతున్నందుకు ఫ్యాన్స్ ఎంతో సంతోషం గా ఉన్నారు.