Peacock Feather Benefits: మనకు వాస్తు శాస్త్రంపై అపార నమ్మకం ఉంటుంది. అందుకే మనం ఏ పని చేసినా అది పద్ధతి ప్రకారం ఉండాలని చూస్తుంటాం. ఇందులో భాగంగా మనకు ప్రతికూలత రాకుండా చూసుకోవాలని ప్రయత్నిస్తుంటాం. చిన్నతనంలో మనం పుస్తకాలలో నెమలి ఈకలను పెట్టుకునే వాళ్లం. చదువు బాగా వస్తుందనే ఉద్దేశంతో ఈకలు పెట్టుకునే వాళ్లం. దీంతో ప్రతికూల శక్తులను దూరం చేసుకునే క్రమంలో ఇలాంటివి చేస్తుండేవాళ్లం. కానీ మనకు తెలియదు ఇది కూడా వాస్తు ప్రకారం మనకు మంచి చేసేదే అని తెలియకుండా పోయేది.

ఇంటిని ప్రత్యేకంగా అలంకరించుకోవాలని అందరు భావిస్తుంటారు. అందమైన వస్తువులతో ఆహుతులను అలరించే విధంగా ఉండాలని కోరుకుంటారు. నెమలి ఈకలను ఇంట్లో పెట్టుకుంటే సానుకూలత కలుగుతుందని నమ్ముతుంటారు. శుభాలను కలిగించే విధంగా నెమలి ఈకలు తోడ్పడతాయని చెబుతుంటారు. నెమలిని హింసించకుండా ఈకలను తీసుకుంటే అదృష్టం, ఐశ్వర్యం కలుగుతాయని ప్రతీతి. వృత్తి, ఉద్యోగాల్లో రాణించాలంటే కూడా నెమలి ఈకలు ప్రధాన పాత్ర పోషిస్తాయని చాలా మందికి తెలియదు.
సుబ్రహ్మణ్య స్వామి వాహనం నెమలి. హిందువులు ఆయనను ఆరాధ్యుడిగా కొలుస్తారు. అందుకే నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకోవడం వల్ల దుష్ట శక్తుల నుంచి కాపాడతాయని నమ్మకం. వ్యాపారాలు నిర్వహించే వారు తమ కౌంటర్ లో ఏడు నెమలి ఈకలు ఉంచుకుంటే కలిసి వస్తుందని చెబుతారు. దక్షిణ మూలలో ఇవి ఉంచుకోవడం మంచిది. ఆర్థిక కష్టాల నుంచి గట్టెక్కుతారు. డబ్బు సంపాదనకు మంచి మార్గం. ఇంట్లో బల్లులు, పాములు వంటివి తిరగకుండా ఉండాలంటే తలుపు మీద రెండు మూడు నెమలి ఈకలు ఉంచుకుంటే అవి రావని ప్రచారం. తూర్పు గోడపై ఏడు నెమలి ఈకలు ఉంచుకున్నట్లయితే కలహాల నుంచి తప్పించుకోవచ్చు.

భార్యాభర్తల బంధాలు బలపడాలంటే నెమలి ఈకలు ఇంట్లో ఉంచుకుంటే బాగుంటుంది. పడక గదిలో రెండు నెమలి ఈకలు ఉంచితే దంపతుల మధ్య సంబంధం మరింత మెరుగుపడుతుంది. ఇలా నెమలి ఈకలు మన జీవితంతో పెనవేసుకుని ఉంటాయి. వాటిని ఇంట్లో ఉంచుకోవడం వల్ల మనకు ఎన్నో రకాల మేలు కలుగుతుంది. రెండు నెమలి ఈకలు కలిపి మంచానికి ఎదురుగా పెడితే కలహాలు ఉండవు. నెమలి ఈకలు మన ఇంట్లో ఉంచుకుంటే మంచి ప్రభావాలే చోటుచేసుకుంటాయని తెలుసుకుని వాటిని ఇంట్లో పెట్టుకోవడం ఉత్తమం.