
Saif Ali Khan Remuneration: #RRR వంటి పాన్ వరల్డ్ బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కొరటాల శివ ఈమధ్యనే రెగ్యులర్ షూటింగ్ ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని రామోజీ ఫిలిం సిటీ లో ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ రాత్రి సమయం లో జరుగుతుంది. ఇందులో హీరోయిన్ గా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ నటిస్తున్న విషయం తెలిసిందే. మొన్న జరిగిన పూజా కార్యక్రమం లో కూడా పాల్గొన్నది.
ఇక ఈరోజు ఈ సినిమా షూటింగ్ లో బాలీవుడ్ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ పాల్గొన్నాడు. ఇందులో ఆయన మెయిన్ విలన్ గా నటిస్తున్నాడు. చాలా రోజుల నుండి మూవీ టీం సైఫ్ అలీ ఖాన్ తో చర్చలు జరుపుతూ వచ్చింది. కొన్ని ముఖ్యమైన వెబ్ సైట్స్ అయితే సైఫ్ అలీ ఖాన్ ఎన్టీఆర్ సినిమాలో నటించడానికి ఒప్పుకోలేదంటూ పుకార్లు కూడా పుట్టించాయి.ఆ పుకార్లు అన్నిటికీ ఇప్పుడు చెక్ పడింది.

ఈరోజు NTR30 షూటింగ్ సెట్స్ లోకి సైఫ్ అలీ ఖాన్ హాజరైన ఫోటోలను మూవీ టీం సోషల్ మీడియా ద్వారా విడుదల చేసింది. అయితే ఈ సినిమా నటిస్తున్నందుకు గాను సైఫ్ అలీ ఖాన్ కి సుమారుగా 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నట్టు సమాచారం. అంత రెమ్యూనరేషన్ ని ఇచ్చి ఇతర బాషల నుండి రప్పించుకోవడం ఎందుకు, మన తెలుగు లో అలాంటి నటులు లేరా అని కొరటాల శివ ని ట్విట్టర్ లో నెటిజెన్స్ ప్రశ్నిస్తున్నారు.
15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇక్కడ కొంతమంది మీడియం రేంజ్ హీరోలు కూడా తీసుకోరు, అలాంటిది విలన్ పాత్ర కోసం 15 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ఇవ్వడం ఇప్పుడు ఇండస్ట్రీ లో హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ ని జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 9 వ తారీఖున విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు తెలుస్తుంది.