Homeఆంధ్రప్రదేశ్‌Chandrababu: చంద్రబాబు డేంజర్ లో ఉన్నాడా?

Chandrababu: చంద్రబాబు డేంజర్ లో ఉన్నాడా?

Chandrababu
Chandrababu

Chandrababu: రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార వైసిపి, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలు రాజకీయ విమర్శలతో రాష్ట్రాన్ని వేడెక్కిస్తుంటే.. మరో పక్క అధికార వైసీపీని మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి కేసు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. తాజాగా తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన ఆరోపణలు చేశారు.

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడుకు రాష్ట్రంలో ముప్పు పొంచి ఉందంటూ టిడిపి రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు అదనపు భద్రత కల్పించాలని ఆయన రాష్ట్ర డిజిపికి లేఖ రాశారు. ఈ నెల 18వ తేదీ నుంచి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కడప, ప్రకాశం, పల్నాడు జిల్లాల్లో పర్యటించనున్నారని ఆ లేఖలో ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18న కడప, 19న ప్రకాశం జిల్లా గిద్దలూరు, 20న మార్కాపురం, 21న ఎర్రగొండపాలెంలో పర్యటిస్తారని అచ్చెన్నాయుడు వెల్లడించారు. ఈ నేపథ్యంలో తగిన భద్రత కల్పించాలని ఆయన డిజిపిని కోరారు.

అసాంఘిక శక్తులు టార్గెట్ చేసే అవకాశం..

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై అసాంఘిక శక్తులు టార్గెట్ చేసే అవకాశం ఉందని డీజీపికి రాసిన లేఖలో అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ నెల 20వ తేదీన చంద్రబాబు నాయుడు పుట్టినరోజు కాబట్టి.. పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరవుతారని, ఆయనకు ఎన్ఎస్జి భద్రత ఉందని, ఆయన సమావేశాలపై రాజకీయ ప్రత్యర్థులు, అసాంఘిక శక్తులు టార్గెట్ చేసే అవకాశం ఉందని అచ్చెన్నాయుడు లేఖలో వెల్లడించారు. అలాగే, చంద్రబాబు నాయుడు పర్యటనకు ఎటువంటి అడ్డంకులు ఏర్పడకుండా తగిన చర్యలు తీసుకోవాలని కోరారు.

బీటెక్ రవికి భద్రత తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం..

ఇకపోతే కడప జిల్లాకు చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు బీటెక్ రవికి భద్రత తొలగించడంపై చంద్రబాబు అభ్యంతరం తెలిపారు. రవికి భద్రత కల్పించాలని కోరుతూ డీజీపికి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు లేఖ రాశారు. రవికి భద్రతను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీగా పదవీకాలం ముగిసిందనే వంక చెబుతూ భద్రతను తొలగించడం సరికాదని చంద్రబాబు వెల్లడించారు. 2006 నుంచి వన్ ప్లస్ వన్ సెక్యూరిటీ ఉందని, సంఘ వ్యతిరేక శక్తుల నుంచి రవికి బెదిరింపులు వస్తున్నాయని ఆయనకు భద్రత కొనసాగించాలని చంద్రబాబు డీజీపిని కోరారు.

Chandrababu
Chandrababu

గతంలో రవి కాన్వాయ్ పై గూండాలు దాడి..

పట్ట భద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో మార్చి 13వ తేదీన రవి కాన్వాపై గూండాలు దాడి చేశారని, అందులో ఆయన కారు ధ్వంసమైందన్న విషయాన్ని ఆ లేఖలో చంద్రబాబు గుర్తు చేశారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో బీటెక్ రవిని నిందితుడిగా చేర్చాలని ఆయన రాజకీయ ప్రత్యర్థులు ప్రయత్నిస్తున్నారని, ఇటువంటి సమయంలో బీటెక్ రవికి ఏదైనా హాని జరిగితే పోలీసులు, ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుందని చంద్రబాబు స్పష్టం చేశారు. కడప జిల్లాలో ఉన్న ప్రత్యేక రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రవికి భద్రత కొనసాగించాలని చంద్రబాబునాయుడు కోరారు. ఒకపక్క చంద్రబాబు నాయుడుకు భద్రత పెంచాలంటూ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు లేఖ రాయగా, మరో పక్క కడప నేత బీటెక్ రవికి భద్రత కల్పించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు డీజీపికి లేఖ రాయడం గమనార్హం. ఇరువురు నేతలు ఒకేసారి భద్రత పేరుతో లేఖలు రాయడం ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా సంచలనం రేపింది. ఇప్పటికే రాష్ట్రంలో వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు సంచలనం సృష్టిస్తుండగా, తాజా లేఖలు దుమారాన్ని రేపుతున్నాయి.

RELATED ARTICLES

Most Popular