
Venky Movie Sister: ‘ టాలీవుడ్ లో ఆల్ టైం క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిల్చిన చిత్రం రవితేజ – శ్రీనువైట్ల కాంబినేషన్ లో వచ్చిన వెంకీ అనే చిత్రం. 2004 వ సంవత్సరం లో విడుదలైన ఈ సినిమా అప్పట్లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిల్చింది. ఇందులోని కామెడీ ని మరో వంద తరాల ప్రేక్షకులు కూడా చూసి కడుపుబ్బా నవ్వుకోవచ్చు. అంత హిలేరియస్ గా ఉంటుంది, ప్రస్తుతం ఈ సినిమాలోని సన్నివేశాలు సోషల్ మీడియా లో వివిధ సందర్భాలలో మీమ్స్ గా వాడుతుంటారు.
జనాలకు అంత ఇష్టం ఈ సినిమా అంటే. రోజంతా కస్టపడి కాసేపు రిలాక్స్ అవుదాం అనుకునే కొన్ని లక్షలాది మందికి మెడిసిన్ లాంటిది ఈ సినిమా, ఇలా ఈ సినిమా గురించి ఎన్ని చెప్పుకున్న అది తక్కువే అవుతుంది. ముఖ్యంగా ఈ చిత్రం లోని ట్రైన్ ఎపిసోడ్ ఒక ట్రెండ్ సెట్టర్, ఇప్పటి వరకు ట్రైన్ లో అంత నిడివి ఉన్న సినిమాలే మన టాలీవుడ్ లో రాలేదు,వచ్చినా అవి సక్సెస్ కాలేదు.

ఇక ఈ చిత్రం లో నటించిన ప్రతీ ఒక్కరు మన అందరికీ తెలిసిన నటులే, కానీ ఇందులో రవితేజ కి చెల్లెలు గా నటించిన శిరీష గురించి మాత్రం పెద్దగా ఎవరికీ తెలియదు.మరో విశేషం ఏమిటంటే ఈమె కేవలం ఈ ఒక్క సినిమాలో మాత్రమే నటించి సినిమాలను వదిలి వెళ్లిపోలేదు, ఈ సినిమా తర్వాత సుమారుగా ఆమె 20 సినిమాలకు పైగానే చేసింది. హీరోయిన్ గా మాత్రం కాదులేండి, క్యారక్టర్ ఆర్టిస్టుగా.
కానీ ఒక్క సినిమాలో కూడా ఈమెకి గుర్తుండిపోయ్యే క్యారక్టర్ రాలేదు, అందుకే ఈమె ఆడియన్స్ కి పెద్దగా పరిచయం లేదు. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు, టీవీ సీరియల్స్ లో కూడా ఈమె నటించింది.పెద్ద సూపర్ హిట్స్ గా నిల్చిన ‘నాతి చరామి’ మరియు ‘అగ్ని పరీక్ష’ వంటి సీరియల్స్ లో ముఖ్యమైన పాత్రలు పోషించింది. ఈమెకి సంబంధించిన లేటెస్ట్ ఫోటోలు కొన్ని ఎక్సక్లూసివ్ గా మీ కోసం అందిస్తున్నాము చూడండి.