
Bandi Sanjay- KCR: టెన్త్ హిందీ ప్రశ్న పత్రం లీకేజీ కేసులో అరెస్టు చేసిన తర్వాత, జైలుకు పంపించిన తర్వాత, హెబియస్ కార్పస్ ద్వారా బయటకు విడుదలైన అనంతరం బండి సంజయ్ చాలా మారిపోయారు. ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఆయన స్టైల్ లో షాక్ లు ఇస్తున్నారు. వాస్తవానికి బండి సంజయ్ ని అకారణంగానే జైలుకు పంపించారని తెలంగాణ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పబ్లిక్ డొమైన్లోకి వచ్చిన తర్వాత ఎవరైనా వచ్చిన మెసేజ్ ను ఫార్వర్డ్ చేస్తారని, ఆ మాత్రం దానికి బండి సంజయ్ ని అరెస్టు చేయడం ఏమిటనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి.
ఇక జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత బండి సంజయ్ పూర్తిగా కెసిఆర్ స్టైల్ లో ఆయనకు తిరుగు సమాధానం చెబుతున్నారు. మొన్నటిదాకా బండి సంజయ్ స్మార్ట్ ఫోన్ మీద నానా యాగి చేసిన భారత రాష్ట్ర సమితి నాయకులకు బండి సంజయ్ దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చారు. ఆరోజు పోలీసులు అరెస్టు చేస్తున్న సమయంలో నా ఫోన్ పోయిందని, అదే విషయాన్ని పోలీసులు కూడా చెప్పానని బండి సంజయ్ చెబుతున్నారు. ఈ మేరకు పోలీసులకు ఈ మెయిల్ ద్వారా కంప్లైంట్ కూడా ఇచ్చారు. దీంతో భారత రాష్ట్ర సమితి నాయకులు బండి సంజయ్ స్మార్ట్ఫోన్ మీద మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. పైగా భద్రతా కారణాల దృష్ట్యా తన సోదరి పేరు మీద తీసుకున్న సీఎం ద్వారా తాను మాట్లాడుతున్నానని, ఆ ఫోన్ కు చాలామంది భారత రాష్ట్ర సమితి నాయకులు తనతో మాట్లాడారని.. ఆ విషయం తెలిసే కెసిఆర్ తనను ఆకారణంగా అరెస్టు చేయించారని బండి సంజయ్ చెబుతున్నారు.

ఇక ప్రధానమంత్రి సికింద్రాబాద్ పర్యటనకు వచ్చినప్పుడు ముఖ్యమంత్రికి ఒక కుర్చీ వేయించాలనే ఆలోచన కూడా బండి సంజయ్ దే అని భారత రాష్ట్ర సమితి నాయకులు చెప్తున్నారు. అలా కుర్చీ వేయించడం ద్వారా కెసిఆర్ కు తాము గౌరవం ఇస్తున్నట్టు బండి సంజయ్ తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లగలిగారు. అంతకుముందే ప్రధానమంత్రి నిర్వహించే సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తే.. ఆయనకు గజమాలతో సన్మానం చేస్తానని బండి సంజయ్ ప్రకటించారు. అంతేకాదు ఆయనకు శాలువాతో కూడా సన్మానం చేయిస్తానని వివరించారు.. కానీ ఈ సమావేశానికి ముఖ్యమంత్రి హాజరు కాలేదు. మరోవైపు సమావేశం ముగిసిన తర్వాత బండి సంజయ్ కెసిఆర్ కు తాను కాపాలనుకున్న శాలువాను కూడా చూపించారు. ఇది ముఖ్యమంత్రి కోసం ప్రత్యేకంగా నేత కార్మికులతో నేయించామని, ఆయన సభకు వస్తే కచ్చితంగా కప్పి సన్మానించేవారిమని సంజయ్ ప్రకటించారు.
ఇలా ప్రకటించడం ద్వారా భారత రాష్ట్ర సమితి నాయకులంటే తమకు గౌరవం అని, అందుకే తాము గౌరవంగా సభకు పిలిచామనే సంకేతాలను తెలంగాణ ప్రజలకు ఇచ్చారు. అదేవిధంగా తమకు రాజకీయాలు తప్ప వ్యక్తిగత వైషమ్యాలు లేవని ప్రజల్లోకి తీసుకెళ్లారు. దీంతో భారత రాష్ట్ర సమితికి మాట్లాడే అవకాశం లేకుండా పోయింది. మరోవైపు భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రస్తుతం వైజాగ్ స్టీల్ ను సింగరేణి ద్వారా బిడ్డింగ్ ప్రక్రియలో పాల్గొంటామని ప్రకటించిన నేపథ్యంలో.. దీనికి బిజెపి నాయకులు ఏ విధమైన కౌంటర్ ఇస్తారో వేచి చూడాల్సి ఉంది.