Vinayaka Chavithi Pakistan: పాకిస్తాన్.. మన దాయాది దేశమే.. అయినా ఆ పేరు వింటేనే ప్రతీ భారతీయుడి గుండెరగిలి పోతుంది. పాకిస్తాన్‌ను లేకుండా చేయాలి అన్నంత కోపం వస్తుంది. ఇందుకు కారణం పాకిస్తాన్ సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం.., భారత భూభాగాల ఆక్రమణకు యత్నించడం. భారత్‌లో మతకలహాలు సృష్టించి అశాంతి రగిల్చేందుకు యత్నించడమే. భారత సైన్యం చేతిలో రెండుసార్లు మూడు నాలుగుసార్లు చావుదెబ్బ తిన్నా కూడా పాకిస్తాన్ వక్రబుద్ధి మరాడం లేదు. అందుకే పాకిస్తాన్ అంటే ప్రతీ భారతీయుడి గుండె రగిలిపోతుంది. అయితే అదే పాకిస్థాన్‌లో వినాయక చవితి జరుపుకుంటారు అనే విషయం చాలా మందికి తెలియదు. ఎవరు నిర్వహిస్తారు ఎక్కడ నిర్వహిస్తారో తెలుసుకుందాం.
కరాచీలో మహారాష్ట్రీయులు..
పాకిస్తాన్‌లోని కరాచీలో మహారాష్ట్ర సంస్థానానికి చెందిన సుమారు 1,500 కుటుంబాలు ఉన్నాయి. స్వాతంత్య్రానికి పూర్వమే 400 కుటుంబాలు కరాచీలో స్థిరపడ్డాయి. స్వాతంత్రం అనంతరం దేశ విభజన జరుగడంతో ఆ కుటుంబాలు పాకిస్తాన్‌లోకి వెళ్లిపోయాయి. నాటి 400 కుటుంబాలు ప్రస్తుతం 1,500 లకు చేరాయి. ఈ కుటుంబాలు ఏటా అక్కడ వినాయక చవితిని ఘనంగా నిర్వహిస్తాయి.
రెండు రోజులపాటు వేడుకలు..
వినాయక చవితి అంటేనే మహారాష్ట్రకు పెట్టింది పేరు. పాకిస్తాన్‌లో స్థిర పడిన మహారాష్ట్రీయులు ఏటా రెండు రోజులపాటు కరాచీలో వినాయక చవితి వేడుకలు జరుపుకుంటారు. స్వాతంత్య్రానికి పూర్వం నుంచే ఈ ఆనవాయితీ వస్తోంది. మొదటి రోజు ఉదయం స్థానిక రత్నేశ్వర్ ఆలయంలో పూజలు నిర్వహిస్తారు. అదేరోజు రాత్రి ఆలయంలో వినాయక విగ్రహం ప్రతిష్టించి పూజలు చేస్తారు. ఆరోజురాత్రంతా ఆలయంలోనే ఉండి పూజలు, భజనలు చేస్తారు. రాత్రంతా జాగరణ చేస్తారు. ఆటపాటలతో గడుపుతారు. సాస్కృతిక ప్రదర్శనలు నిర్వహిస్తారు. పిల్లలు ఆటపాటలతో సంతోషంగా గడుపుతారు. గణేశ్ చవితి అనగానే నూతన సంవత్సరం వచ్చినంత ఆనందంగా ఉంటుందని అక్కడి మహారాష్ట్రీయులు చెబుతారు.
రెండో రోజు నిమజ్జనం..
ఇక పండుగ రెండో రోజు మహారాష్ట్రీయులంతా భక్తిశ్రద్దలతో వినాయకుడిని కొలుస్తారు. గర్భా నృత్యం చేసుకుంటూ గణపతి విగ్రహాన్ని సమీపంలోని చెరువు వద్దకు తీసుకెళ్లి నిమజ్జనం చేస్తారు. నిమజ్జనం కూడా మహారాష్ట్రలో జరిగిన విధంగానే ఉత్సాహంగా నిర్వహిస్తారు. శోభాయాత్రగా వెళతారు. నృత్యాలు చేస్తారు. గణపతి బొప్పా మోరియా అంటూ నినాదాలు చేస్తారు. గణపతి నిమజ్జన సమయంలో కొత బాధగా ఉంటుందని, అయితే మళ్లీ చవితికి వస్తాడని ఉత్సాహంగా సాగనంపుతామని చెబుతున్నారు కరాచీలోని మహారాష్ట్ర కుటుంబాలు. కరాచీలోని హిందూ–మహారాష్ట్ర సమాజం గణపతి బప్పాకు వీడ్కోలు పలికేందుకు గణేష్ విసర్జన్ చాలా ఉత్సాహంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కరాచీ డోలి ఖాటాలోని గణేష్ మఠం మందిర్, బోరి కాంపౌండ్ ఏరియా, స్వామి నారాయణ్ మందిర్ మరియు క్లిఫ్టన్‌లోని ప్రసిద్ధ శివ మందిరంలో గణేష్ ఉత్సవాలను ఉల్లాసంగా నిర్వహించారు. పాకిస్తాన్‌లో మైనారిటీలుగా ఉన్న హిందువులు వినాయక చవితితోపాటు జన్మాష్టమి, దీపావళి వంటి ఇతర పండుగలను కూడా జరుపుకుంటారు.