
Game Changer Movie Songs: #RRR వంటి గ్లోబల్ సెన్సేషన్ తర్వాత మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా 70 శాతం పూర్తి అయ్యినట్టు నేడు దిల్ రాజు మీడియా కి తెలిపాడు. పొలిటికల్ నేపథ్యం లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా, కైరా అద్వానీ హీరోయిన్ గా నటిస్తుంది.
ఇక శ్రీకాంత్ , SJ సూర్య , సునీల్ మరియు అంజలి వంటి నటీనటులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.ఇక తన ఆస్థాన సంగీత దర్శకుడు AR రెహ్మాన్ ని పక్కన పెట్టి, డైరెక్టర్ శంకర్ ఈసారి సౌత్ ఇండియన్ సెన్సేషన్ థమన్ ని తీసుకున్నాడు. ఇప్పటి వరకు ఆయన అద్భుతమైన ట్యూన్స్ ని ఇచ్చినట్టు సమాచారం, రీసెంట్ గా విడుదల చేసిన కాన్సెప్ట్ వీడియో కి కూడా థమన్ అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చాడు.
శంకర్ సినిమాలు అంటే కచ్చితంగా పాటలు ఒక రేంజ్ లో ఉండాలి, సాంగ్స్ పిక్చరైజేషన్ మీద ఆయన చూపించే శ్రద్ద బహుశా ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో ఏ డైరెక్టర్ కూడా చూపించడు అనడం లో ఎలాంటి అతిశయోక్తి లేదు. సినిమాకి అయ్యే బడ్జెట్ లో 50 శాతం వరకు కేవలం సాంగ్స్ కోసం ఖర్చు పెట్టిస్తాడు శంకర్.’గేమ్ చేంజర్’ కి కూడా శంకర్ దిల్ రాజు కి చుక్కలు కనపడే రేంజ్ లో ఖర్చు చెయ్యిస్తున్నాడట.

కేవలం సాంగ్స్ కోసమే ఇప్పటి వరకు దిల్ రాజు 50 కోట్ల రూపాయిలు ఖర్చు చేసినట్టు సమాచారం. రేపు ఈ సాంగ్స్ వెండితెర మీద ఎలా ఉండబోతుందో చూడాలి. ఇక ఈ చిత్రానికి సంబంధించి 30 శాతం షూటింగ్ బ్యాలన్స్ ఉందని, అది అయిపోగానే ఈ సినిమాని సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల చెయ్యబోతున్నట్టు నిర్మాత దిల్ రాజు తెలిపాడు. దీనికి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలోనే అధికారికంగా తెలియనున్నాయి.