Anasuya Bharadwaj: అనసూయ ఈ పేరు తెలియని వారుండరు. బుల్లితెర నుంచి వెండితెర వరకు తన అందంతో ఊపు ఊపుతున్న యాంకర్, నటి అనసూయ ఎన్నో షోలతో తనదైన గుర్తింపు తెచ్చుకుంది. జబర్దస్త్ షో తో వెలుగులోకి వచ్చిన ఆమె దానికి గుడ్ బై చెప్పి ప్రస్తుతం ఇతర షోలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఈ నేపథ్యంలో వెండితెరలో కూడా ఓ ఊపు ఊపుతోంది. రంగస్థలంలో రంగమ్మత్తగా అనసూయకు మంచి మార్కులే పడ్డాయి. ఇక పుష్పలో దాక్షాయణిగా కూడా మంచి గుర్తింపు దక్కించుకుంది. ఇలా సినిమాలు, టీవీ షోలతో బిజీగా మారిపోయింది.

యాంకర్ అంటేనే సుమ పేరు గుర్తుకు వస్తుంది. ఇంకా మొదట్లో ఉదయభాను తనదైన శైలిలో రాణించి అందరిని ఆకట్టుకుంది. కాల క్రమంలో అనివార్య కారణాల వల్ల ఆమె వెనకడుగు వేయడంతో సుమ ముందుకు వచ్చింది. పరిశ్రమలో సుమకు ఉన్న పారితోషికం ఎవరికి ఉండదనే టాక్. కానీ ప్రస్తుతం అనసూయ కూడా సుమ కంటే ఎక్కువ పారితోషికం తీసుకుంటున్నట్లు చెబుతున్నారు. ఒక్కో షోకు రెండు లక్షల వరకు తీసుకుంటుందని ప్రచారం సాగుతోంది. దీంతోనే ఆమెను పిలవడానికే జంకుతున్నారట. అమ్మో అంత రెమ్యునరేషనా అని ఆశ్చర్యపోతున్నారట.
అనసూయ టీవీ షోలతో పాటు వెబ్ సిరీస్ ల్లో కూడా నటిస్తోంది. ఇటీవల కన్యాశుల్కం అనే కావ్యం ఆధారంగా ప్రసారం అవుతున్న వెబ్ సిరీస్ లో ఆమె నటిస్తోంది. ఇందులో ఆమెది మధురవాణి అనే వేశ్య పాత్రలో నటిస్తోంది. కథ మొత్తం ఆమె చుట్టూనే తిరుగుతుందట. ఈ నేపథ్యంలో అనసూయ అటు బుల్లితెర ఇటు వెండితెరను ఏలుతోంది. రంగమార్తాండ సినిమాలో కూడా మంచి పాత్ర పోషించిందని చెబుతున్నారు. అనసూయ దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకుంటున్నట్లు అందం ఉన్నప్పుడే సంపాదన పెంచుకుంటుందని ప్రచారం సాగుతోంది.

అనసూయ జబర్దస్త్ నుంచి వెళ్లిపోయాక తన రేటు అమాతం పెంచేసింది. దీంతో ఆమెకు అవకాశాలు రావడం లేదని అంటున్నారు. వెండితెరకు ప్రాధాన్యం ఇస్తుండటంతోనే ఆమెను పిలిచేందుకు భయపడుతున్నారు. అనసూయ మొత్తానికి తన అందంతో అందరిని ఆశ్చర్యంలో ముంచెత్తుతూ టీవీ షోలు, సినిమాల్లో గుర్తింపు తెచ్చుకుంటోంది. భవిష్యత్ లో ఆమె ఇంకా బాగా రాణించి బాగా ఎదగాలని ఆమె అభిమానులు కోరుకుంటున్నారు. అనసూయకు ఫాలోవర్లు కూడా ఎక్కువే. సామాజిక మాధ్యమాల్లో కూడా ఆమె ఎప్పుడు బిజీగానే ఉంటోంది.