Ludo Game: ఓడలు బండ్లవుతాయి. బండ్లు ఓడలవుతాయి. అదృష్టం కలిసి రాకపోతే మాత్రం ఎవరేమి చేస్తారు. ధర్మరాజు అంతటి వాడే ద్రౌపతిని పందెంలో ఓడిపోయి చివరకు అరణ్యాలు పట్టిన సంగతి మహాభారతంలో చూశాం. ఇక్కడ అలాంటి ఘటన చోటుచేసుకోవడం గమనార్హం. కాకపోతే ఇక్కడ తన మీదే తానే పందెం వేసుకుని ఓటమి పాలై చివరకు ఇంకొకరి వశమైన సంఘటన ఆసక్తి గొలుపుతోంది. ఆట ఎంతటి వారినైనా కట్టిపడేస్తుంది. అందులో ఓటమే కానీ విజయం దక్కని ఆమె ఉన్నదంతా ఊడ్చినాక తన మీదే పందెం కాచుకుంది. అపజయం కలగడంతో చివరకు అతడి ఇంటికే వెళ్లింది. దీంతో ఆమె భర్త పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడం గమనార్హం.

తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ప్రతాప్ గడ్ కు చెందిన రేణు భర్తతో కలిసి నివాసం ఉంటోంది. భర్తకు రాజస్తాన్ లో ఉద్యోగం రావడంతో ఆమెను అక్కడే ఉంచి అతడు మాత్రం రాజస్తాన్ వెళ్లి ఉద్యోగం చేస్తున్నాడు. వారికి ఇద్దరు పిల్లలు. నెలనెల భార్యకు డబ్బులు పంపుతున్నాడు. ఊరికే ఉండలేక రేణు ఆన్ లైన్ గేమ్ లూడోకు బానిసైంది. బెట్టింగుల్లో డబ్బు పోగొట్టుకుంటూ వస్తోంది. ఈ నేపథ్యంలో తాను అద్దెకుండే ఇంటి యజమానితో పందెం కాసింది. డబ్బు అంతా పోవడంతో ఇక తన మీదే పందెం వేసింది. అందులో ఓటమి చెందడంతో ఇంటి యజమాని ఆమెను తన ఇంటికి తీసుకెళ్లాడు. దీంతో ఆమె భర్తకు విషయం ఫోన్ లో చెప్పడంతో అతడు హుటాహుటిన చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
ఈ విషయం కాస్త సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. బెట్టింగులో ఓటమితో ఇంటి యజమానితో కలిసి ఉంటోంది. భర్త వచ్చి రావాలని కోరినా నేను రానని చెబుతోంది. దీంతో భర్త ఆందోళన పడుతున్నాడు. తన భార్యను మాయమాటలతో మోసగించిన అతడిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు. కానీ అచ్చం మహాభారతంలో జరిగిన సంఘటన లాగే ఉన్నా ఇందులో పందెం కాసింది మాత్రం ఆమె కావడం గమనార్హం. మనకు పురాణాలు కూడా ఇలాంటి విషయాలు ఊరకనే చెప్పలేదని తెలుస్తోంది.

ప్రస్తుతం భర్తను వదిలి పరాయి పురుషుడి వద్ద ఉంటున్న రేణు అచ్చం కలియుగ ద్రౌపతిలా అభిర్ణిస్తున్నారు. కావాలనే ఓడిందా అతడే ఓడించాడా అనేది అనుమానమే. అయినా ఆటలో ఓడినంత మాత్రాన కట్టుకున్న భర్తను వదిలి వెళ్లడంపై విమర్శలు వస్తున్నాయి. అభినవ ద్రౌపతి తీరుపై అందరు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. కట్టుకున్న వాడికే శఠగోపం పెట్టి ఇప్పుడు అతడిని వదిలి రానని చెప్పడమేమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. రేణు వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.