
Director Venu: కర్కశుడి చేత కన్నీళ్లు పెట్టించింది ‘బలగం’ సినిమా. మానవ బంధాలు, విలువల గురించి తెలిపిన ఈ సినిమాను చూసిన ప్రతి ఒక్కరు చిత్రం యూనిట్ ను అభినందిస్తున్నారు. ఈ సినిమాలో చివరి సాంగ్ ‘తోడుగా మా తోడుండి’..పాటతో కన్నీళ్లు పెట్టని వారు లేదు. ఈ పాట పాడింది మొగిలయ్య, కొంరమ్మ అనే దంపతులు. తమ గానంతో సినీ ప్రేక్షకులను ఆకట్టుకున్న వీరిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అయితే ఇటీవల మొగిలయ్య ఆరోగ్యం క్షీణించింది. ఈ సందర్భంగా ఆయనకు అండగా ఉండేందుకు ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా ‘బలగం’ సినిమా డైరెక్టర్ వేణు లక్ష రూపాయల ఆర్థిక సాయం చేసి మంచి మనసును చాటుకున్నాడు.
కరోనా తరువాత మొగిలయ్య ఆరోగ్యం క్షీణిస్తూ వస్తోంది. ఆయన రెండు కిడ్నీలు ఫెయిలయ్యాయి. షుగర్, బీపీలతో ఆయనకు వైద్యం చేయడం కష్టంగా మారింది. బలగం సినిమా తరువాత చూపు కూడా సరిగ్గా ఉండడం లేదని ఆయన తెలిపారు. అయితే తన సినిమా సక్సెక్ కావడంలో మొగిలయ్యా దంపతుల కృషి ఎంతో ఉంది. దీంతో మొగలియ్య ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్న ఆయన వారి ఇంటికి వెళ్లి పరామర్శించారు. వారికి లక్ష రూపాయలు అందించి సన్మానించారు. దీనికి సంబంధించిన వీడియో వేణు తన సొంత యూట్యూబ్ చానెల్ లో ఉంచాడు.
మొగలియ్య పరిస్థితి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తెలంగాణ ప్రభుత్వం ఆయనను ఆదుకునేందుకు ముందుకు వచ్చింది. ఆయన ఆరోగ్య పరిస్థితి తెలిసిన వెంటనే వైద్య ఖర్చులు మొత్తం ప్రభుత్వమే భరిస్తుందని భరోసా ఇచ్చారు. అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కి ఫోన్ చేసి మరీ ఆదేశాలు జారీ చేశారు. ఇదిలా ఉండా మంత్రి హరీష్ రావు సైతం స్పందించి మొగిలయ్యను నిమ్స్ ఆసుపత్రికి తరలించాలని తెలిపినట్లు సమాచారం.

తన గానంతో ప్రేక్షకుల గుండెల్ని పిండేసిన మొగిలయ్య త్వరగా కోలుకోవాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. అసలే ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రాన ఉన్న మొగిలయ్యకు ఇలాంటి పరిస్తితి రావడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో మొగిలయ్య కోలుకోని మరిన్ని సినిమాల్లో పాటలు పాడాలని కోరుకుంటున్నారు. ఇదిలా ఉండగా మొగిలయ్య పాడిన ఈ సాంగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.