https://oktelugu.com/

Allu Arjun: బాలనటుడిగా అల్లు అర్జున్ నటించిన సూపర్ హిట్ సినిమాలు ఇవే!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..గత ఏడాది విడుదలైన పుష్ప సినిమా తో ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ప్రతి స్టార్ హీరో కి పాన్ ఇండియా మార్కెట్ రావడం కోసం రాజమౌళి తో సినిమా చెయ్యాలని కోరుకుంటారు..కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి సహాయం లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : November 24, 2022 / 02:32 PM IST
    Follow us on

    Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కి ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు..గత ఏడాది విడుదలైన పుష్ప సినిమా తో ఆయన బాక్స్ ఆఫీస్ వద్ద సృష్టించిన ప్రభంజనం అంత తేలికగా ఎవ్వరు మర్చిపోలేరు..ప్రతి స్టార్ హీరో కి పాన్ ఇండియా మార్కెట్ రావడం కోసం రాజమౌళి తో సినిమా చెయ్యాలని కోరుకుంటారు..కానీ అల్లు అర్జున్ మాత్రం రాజమౌళి సహాయం లేకుండానే పాన్ ఇండియా మార్కెట్ ని కాదు..పాన్ వరల్డ్ మార్కెట్ ని కొల్లగొట్టాడు.

    Allu Arjun

    చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీ లో అడుగుపెట్టినప్పటి తొలి సినిమా నుండే తనదైన మార్క్ తో హిట్టు మీద హిట్టు కొడుతూ అంచలంచలుగా ఎదిగాడు..ఈరోజు అతని సినిమా కోసం ప్రపంచం మొత్తం ఆతృతగా ఎదురు చూస్తుంది..ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ సినిమాల్లో హీరోగా అడుగుపెట్టకముందు కూడా బాలనటుడిగా పలు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలలో నటించాడని విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు.

    కమల్ హాసన్ – కె విశ్వనాధ్ కాంబినేషన్ లో వచ్చిన స్వాతి ముత్యం చిత్రం ఒక కల్ట్ క్లాసిక్ గా మిగిలిపోయింది..ఈ సినిమాకి తెలుగు లో పంపిణీదారుడిగా అల్లు అరవింద్ వ్యవహరించాడు..అయితే విశ్వనాధ్ కి ఒకరోజు చైల్డ్ ఆర్టిస్ట్స్ అవసరం పడింది..అలా చైల్డ్ ఆర్టిస్ట్స్ కోసం ఆడిషన్స్ చేస్తున్న సమయం లో ఒకరోజు అల్లు అర్జున్ షూటింగ్ స్పాట్ కి వచ్చాడు..ఎవరీ కుర్రాడు చాలా హుషారుగా ఉన్నాడే అని మూవీ యూనిట్ ని అడిగాడట.

    Allu Arjun

    అల్లు అరవింద్ గారి అబ్బాయి అని చెప్పడం తో వెంటనే అల్లు అరవింద్ కి ఫోన్ చేసి ‘మీవాడు నాకు చాలా బాగా నచ్చాడు..మన సినిమాలో అవసరమైన చైల్డ్ ఆర్టిస్టు పాత్రని ఇచ్చేస్తున్నా’ అని చెప్పి అల్లు అర్జున్ తో ఆ సినిమాలో నటింపచేసాడట..ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ బాలనటుడిగా మెగాస్టార్ చిరంజీవి హీరో గా నటించిన విజేత లో కూడా చేసాడు..అలా హీరో గా ఇండస్ట్రీ కి పరిచయం కాకముందు అల్లు అర్జున్ బాలనటుడిగా ఈ రెండు సినిమాలలో నటించాడు.

    Tags