
Samantha: సమంత దేశంలోనే టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఇండియా వైడ్ పాపులారిటీ ఉన్న యాక్ట్రెస్. సమంత పరిశ్రమకు వచ్చి 13 ఏళ్ళు అవుతుంది. మొదటి చిత్రం ఏమాయ చేసావే నుండి ఇప్పటి వరకు ఆమె వెనక్కి తిరిగి చూసుకుందే లేదు. హిట్టు మీద హిట్టు ఇస్తూ ఎవరికీ అందనంత రేంజ్ కి వెళ్ళింది. తిరుగులేని స్టార్డం వచ్చినా సమంత ఎన్నడూ రిలాక్స్ కాలేదు. ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో రిస్కీ అండ్ టఫ్ రోల్ చేశారు. సాహసోపేతమైన యాక్షన్ సన్నివేశాల్లో నటించారు. ఒక ప్రక్క సినిమాలు చేస్తూనే సమంత యాక్షన్ ఓరియెంటెడ్ వెబ్ సిరీస్లు చేస్తున్నారు.
Also Read: Ponniyin Selvan: మణిరత్నం అయితే ఏంటట.. తెలుగు వాళ్లకు అందుకే ‘పొన్నియన్’ ఎక్కలేదు..
ది ఫ్యామిలీ మాన్ 2 సిరీస్లో సమంత శ్రీలంక రెబల్ రోల్ చేశారు. ఈ సిరీస్ సూపర్ హిట్ కాగా… ఆమెకు నార్త్ ఇండియాలో కూడా ఫాలోయింగ్ వచ్చింది. ప్రస్తుతం సిటాడెల్ షూట్లో పాల్గొంటున్నారు. ఇది కూడా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్. సమంత విపరీతంగా కష్టపడుతున్నారు. ఆమె యాక్షన్ సన్నివేశాల్లో పాల్గొనగా ఆమె చేతుల నిండా గాయాలయ్యాయి. ఆ గాయాలకు సంబంధించిన ఫోటోలు ఫ్యాన్స్ తో ఆమె షేర్ చేశారు.
సమంత చాలా కమిటెడ్ యాక్ట్రెస్ కాబట్టే ఆమె ఈ స్థాయికి చేరుకున్నారు. కాగా సమంత సినిమాలు చేయకుండా ఇంట్లో కూర్చున్నా కూడా కోట్లు సంపాదించగలదు. ఇంస్టాగ్రామ్ సెలెబ్రెటీలకు ఆదాయమార్గంగా మారిన విషయం తెలిసిందే. వ్యాపార ఉత్పత్తులను ప్రమోట్ చేస్తూ ఇంస్టాగ్రామ్ లో వీడియో పోస్ట్ చేసి లక్షల్లో తీసుకోవచ్చు. సమంత అదే చేస్తున్నారు. 24 మిలియన్స్ కి పైగా ఫాలోవర్స్ కలిగిన సమంత ఒక్కో ప్రొడక్ట్ ప్రమోట్ చేసినందుకు రూ. 20 లక్షల వరకూ తీసుకుంటున్నారట. అంటే సమంత హ్యాపీగా ఇంట్లో ఉండి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేస్తూ నెలకు రూ. 3 కోట్ల వరకు సంపాదించగలదట.

నిజానికి కొందరు హీరోయిన్స్ అంత మొత్తం సంపాదించాలంటే నాలుగైదు సినిమాలు చేయాలి. సమంత మాత్రం తన పాపులారిటీతో కేవలం సోషల్ మీడియా ద్వారా కోట్లు సంపాదిస్తున్నారు. సిటాడెల్ సిరీస్ తో పాటు సమంత ఖుషి చిత్ర షూటింగ్ పూర్తి చేయాల్సి ఉంది. దర్శకుడు శివ నిర్వాణ తెరకెక్కిస్తున్న ఈ చిత్ర షూటింగ్ త్వరలో తిరిగి ప్రారంభం కానున్నట్లు సమాచారం. ఖుషి చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే.