https://oktelugu.com/

Dalapati Vijay Assets : సినిమాకు రూ.150 కోట్లు… దళపతి విజయ్ కి ఎన్ని కోట్ల ఆస్తులు ఉన్నాయో తెలుసా!

Dalapati Vijay assets : గత పదేళ్లలో కోలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు విజయ్. ఆయన తలైవి రజినీకాంత్ ని కూడా వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. వరుస విజయాలతో వందల కోట్ల వసూళ్లు అవలీలగా సాధిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన విజయ్ ప్రతిసినిమా రెండు వందల కోట్లు వసూలు చేసింది. గతంలో ఆయనకు తెలుగులో మార్కెట్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పరుచుకున్నారు. తుపాకీ, అదిరింది, విజిల్, మాస్టర్ […]

Written By:
  • NARESH
  • , Updated On : January 17, 2023 / 08:54 PM IST
    Follow us on

    Dalapati Vijay assets : గత పదేళ్లలో కోలీవుడ్ సూపర్ స్టార్ గా ఎదిగారు విజయ్. ఆయన తలైవి రజినీకాంత్ ని కూడా వెనక్కి నెట్టి టాప్ పొజిషన్ కైవసం చేసుకున్నాడు. వరుస విజయాలతో వందల కోట్ల వసూళ్లు అవలీలగా సాధిస్తున్నాడు. ఈ మధ్య కాలంలో విడుదలైన విజయ్ ప్రతిసినిమా రెండు వందల కోట్లు వసూలు చేసింది. గతంలో ఆయనకు తెలుగులో మార్కెట్ లేదు. ప్రస్తుతం టాలీవుడ్ లో కూడా మార్కెట్ ఏర్పరుచుకున్నారు. తుపాకీ, అదిరింది, విజిల్, మాస్టర్ తెలుగులో మంచి వసూళ్లు సాధించాయి. ఈ క్రమంలో విజయ్ రెమ్యూనరేషన్ విపరీతంగా పెంచేశాడు.

    విజయ్ ప్రస్తుతం రూ. 120 కోట్లు తీసుకుంటున్నాడు. దిల్ రాజు ఆయనకు ఏకంగా రూ. 150 కోట్లు ఇచ్చినట్లు ట్రేడ్ వర్గాల బోగట్టా. హీరోగా మూడు దశాబ్దాల కెరీర్ విజయ్ పూర్తి చేశాడు. దశాబ్దానికి పైగా స్టార్ హీరోగా ఉన్నాడు. ఈ క్రమంలో విజయ్ భారీగా ఆస్తులు కూడబెట్టారట. ఆయన ప్రస్తుత సంపద విలువ రూ. 500 కోట్లకు పైమాటే అంటున్నారు. రానున్న కాలంలో ఆయన మరింత రెమ్యూనరేషన్ పెంచే సూచనలు కలవు. ప్లాప్ టాక్ లో కూడా మినిమమ్ వసూళ్లు ఆయన సినిమాకు వస్తాయి.

    ఆయన లేటెస్ట్ రిలీజ్ వారసుడు తెలుగు, తమిళ రాష్ట్రాల్లో మంచి వసూళ్లే రాబట్టింది. ఈ సినిమాకు యావరేజ్ టాక్ వచ్చింది. అజిత్ తునివు చిత్రానికి పోటీగా వారసుడు విడుదలైంది. అయితే కోలీవుడ్ సంక్రాంతి విన్నర్ అజిత్ అంటున్నారు. వారిసు పై తునివు వసూళ్లపరంగా ఆధిపత్యం ప్రదర్శించింది. ఈ క్రమంలో అజిత్ విజయ్ మీద పైచేయి సాధించారు. తమిళ వెర్షన్ జనవరి 11న విడుదలైంది. తెలుగు వెర్షన్ వారసుడు జనవరి 14న విడుదల చేశారు.

    దిల్ రాజు వారసుడు చిత్రాన్ని భారీగా నిర్మించారు. దర్శకుడు వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. వారసుడు మూవీలో రష్మిక మందాన హీరోయిన్ గా నటించారు. థమన్ సంగీతం అందించారు. విజయ్ 67వ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో క్రైమ్ యాక్షన్ డ్రామాగా మూవీ తెరకెక్కుతుంది. ఈ ఏడాది చివర్లో విడుదల కానుంది. విక్రమ్ మూవీతో ఇండస్ట్రీ హిట్ కొట్టిన లోకేష్ కనకరాజ్ నుండి వస్తున్న మూవీ కావడంతో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. గతంలో వీరి కాంబోలో తెరకెక్కిన మాస్టర్ మంచి విజయం సాధించింది.