
CM KCR: ‘రాజు బాగుంటేనే రాజ్యం బాగుంటుంది’అంటున్నారు పండితులు. నేటి కాలం ప్రకారం.. ఒక ముఖ్యమంత్రి జాతకం బాగుంటేనే ఆ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో వర్దిల్లుతారని చెబుతున్నారు. ఉగాది పర్వదినాన ప్రతి ఒక్కరు ఆ ఏడాది తమ జాతకం ఎలా ఉందో తెలుసుకుంటారు. ఇక ప్రముఖులు, రాజకీయ నాయకులు ఆ సంవత్సరం జరగబోయే మంచి చెడుల గురించి ముందే తెలుసుకొని అందుకు అనుగుణంగా నడుచుకుంటారు. 2023 సంవత్సరం ప్రతి రాజకీయ నాయకుడికి ఇంపార్టెంట్. వచ్చే ఏడాదిలో ఎన్నికలు ఉండబోతున్నందున ఈ సంవత్సరం జాతకం ఎలా ఉందో తెలుసుకోవాలని చాలా మంది పొలిటీషియన్స్ జ్యోతిష్యులను ఆశ్రయించారు. తమ జాతకంతో పాటు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతకం ఎలా ఉంది? అని ప్రతి ఒక్కరూ తెలుసుకున్నారు. పండితులు చెప్పిన ప్రకారం కేసీఆర్ జాతకం ఎలా ఉందో చూద్దాం.
సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు 1954 ఫిబ్రవరి 17న జన్మించారు. ఆయన అశ్లేష నక్షత్రంలో జన్మించారు. దీని ప్రకారం ఆయనది కర్ఖాటక రాశి. మేషలగ్నంలో ధన స్థానంలో గురుడు, తృతయ స్థానంలో కేతువు, చతుర్థ స్థానంలో చంద్రుడు, సప్తమంలో శని, అష్టమంలో కుజుడు, నవమంలో రాహువు, ఏకాదంలో సూర్య, శుక్ర, బుధులతో ఉండే సమయంలో కేసీఆర్ జన్మించారు. 2023 సంవత్సరంలో కర్కాటక రాశికి మిశ్రమంగా ఉందని జ్యోతిష్యులు చెబుతున్నారు. ద్వితీయార్థం అక్టోబర్ కంటే ప్రథమార్థం కొంత కలిసి వస్తుందని చెబుతున్నారు. అయితే కర్కాటక రాశికి ఈ జనవరి 17న అష్టమ శని దోషం ఏర్పడినందున జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

ఈ రాశి వారు ప్రతీ విషయాన్ని నమ్మకుండా సొంత కాన్ఫిడెంట్ తో ముందుకు వెళ్లాలని చెబుతున్నారు. కేసీఆర్ జాతకం ప్రకారం ఇప్పుడు పరిస్థితులను చూస్తే జ్యోతిష్యులు చెప్పింది నిజమేనని బీఆర్ఎస్ నాయకులు భావిస్తున్నారు. ఏప్రిల్ 22 నుంచి ఆయనకు మంచిరోజులు వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బృహస్పతి దశమ స్థానంలో ఉండడం వల్ల ఎక్కువ ప్రయాణాలు చేయాల్సి వస్తుందని, అందువల్ల కొంత సంయమనం పాటించాలని సూచిస్తున్నారు. అయితే దైవబలాన్ని పెంచుకోవడం ద్వారా ఎలాంటి దుష్ఫరిణామాలు ఎదురుకావని అంటున్నారు.
కేసీఆర్ జాతకం కోసం ఆయన కుటుంబ సభ్యులే కాకుండా బీఆర్ఎస్ నాయకులు, మంత్రులు రాష్ట్ర ప్రజలు ఎదురుచూశారు. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండడం వల్ల ఈ సంవత్సరం చివరిలోనే ఆ మూడ్ లోకి వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ ఎలాంటి ప్రజాకర్షక పథకాలు ప్రకటిస్తారు? ఆయన తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి? అని అందరూ అనుకున్నారు. అలాగే కొందరు బీఆర్ఎస్ నాయకులు తమపై కేసీఆర్ ఎలాంటి అనుకూల వాతావరణంతో ఉంటారోనని అనుకున్నారు. అందువల్ల ఆయన జాతకం గురించి తెలుసుకోవడానికి ఆసక్తి చూపారు.
ఇక కేసీఆర్ ఆధ్యాత్మిక విషయాలపై ఎక్కువగా శ్రద్ధ పెడుతారు. గతంలో దోష నివారణ కోసం పలు యాగాలు నిర్వహించారు. ఇప్పడు ద్వితీయార్థం లో కాస్త జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఇప్పుడు కూడా దైవ బలం తోడైతే విజయం ఆయనదే అని చెబుతున్నారు. ద్వితీయార్థంలోనే ఎన్నికలు రానున్నందున కేసీఆర్ దైవ బలం పెంచుకోవడానికి ఎలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తారోనని అనుకుంటున్నారు.