Farting: మనుషులు విడుదల చేసే అపాన వాయువు (పిత్తు) మన ఆయువు తీస్తుందట. చిన్న పిత్తు ఇంత ప్రమాదకరమా అనుకుంటున్నారా.. కానీ నిజమే పిత్తు ఈ భూమికి ప్రమాదకరంగా మారుతుంది అని ఓ అధ్యయనం తేల్చింది. పిత్తుల కారణంగా 200 ఏళ్ల తర్వాత ఈ భూమి నివసించేందుకు అనుకూలంగా ఉండదని ఆ స్టడీ చెబుతోంది. వచ్చే 200 ఏళ్లలో భూమి భరించలేని విధంగా మారుతుందనీ, నివసించడానికి వీలుగా ఉండదని, అందుకు అనేక కారణాల్లో.. పిత్తులు కూడా ఓ కారణం అని ఈ అధ్యయనం తేల్చింది.
ఎందుకంత ప్రమాదరకమంటే..
మనుషులు ఎక్కువగా మీథేన్, నైట్రస్ ఆక్సైడ్ వాయువుల్ని, పిత్తులు, త్రేనుపుల రూపంలో విడుదల చేస్తున్నారు. ఇవి భూతాపాన్ని పెంచుతున్నాయని బ్రిటన్‌కి చెందిన యూకే సెంటర్ ఫర్ ఎకోలజీ అండ్ హైడ్రాలజీకి చెందిన డాక్టర్ నికోలస్ కోవాన్ సారధ్యంలోని అధ్యయనం తెలిపింది. మనుషులు త్రేన్పులు, అపాన వాయువు రూపంలో మీథేన్, అయోన్ ఫ్లాటస్ గ్యాస్‌ని ఎక్కువగా విడుదల చేస్తున్నారని ఈ అధ్యయనం వివరించింది.
పెరుగుతున్న భూతాపం..
మీథేన్ వాయువుకి తోడు.. ప్రపంచవ్యాప్తంగా రకరకాల కారణాలతో భూతాపం పెరుగుతోంది. ఫలితంగా సముద్రాలు త్వరగా ఆవిరవుతున్నాయి. నీటి ఆవిరి ఆకాశంలోకి వెళ్లి.. ఓ దుప్పటిలాగా పరచుకుంటోంది. దీని వల్ల భూమిపై ఉన్న వేడి.. వాతావరణంలో కలిసిపోవడం లేదు. క్రమంగా ఈ వేడి పెరుగుతూనే ఉందని స్విట్జర్లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ జెనీవాకి చెందిన గిల్లామ్ చావెరట్ తెలిపారు. ఇలా భూమి వేడెక్కుతున్న కొద్దీ.. సముద్రాల్లో నీరు మాయం అవుతూనే ఉంటుందనీ, కొన్నేళ్లలో సముద్రాలు పూర్తిగా ఆవిరై ఉష్ణోగ్రతలు వందల డిగ్రీలు పెరుగుతాయని అభిప్రాయపడ్డారు. గిల్లామ్ అధ్యయనంలో స్విట్జర్లాండ్ లోని వ్యోమగాములు, ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్‌లోని సీఎన్‌ఆర్‌ఎస్ ల్యాబరేటరీస్ కూడా పాల్గొన్నాయి. సూర్యుడి నుంచి వచ్చే రేడియేషన్ కొంచెం పెరిగినా భూమిపై వేడి పదుల డిగ్రీలు పెరుగుతుందని వీరు గుర్తించారు.
200 ఏళ్లలో అంతం..
పెరుగుతున్న భూతాపం, అపానవాయువు, మీథేన్, సముద్రాలు ఆవిరవ్వడం వంటి అన్ని అంశాలూ కలిసి.. 200 ఏళ్లలో భూమిపై గ్రీన్ హౌస్ వాయువులు అధికమవుతాయి. వాటిని తగ్గించలేని స్థితికి చేరుతాయని ఈ అధ్యయనాలు చెబుతున్నాయి. ఫలితంగా వచ్చే 200 ఏళ్లలో భూమి కూడా.. శుక్రగ్రహంలా మారి, మనుషులు జీవించేందుకు అనుకూలంగా ఉండదు అని చెబుతున్నారు.