Homeట్రెండింగ్ న్యూస్IT Regulations: మీ ఇంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉందా; ఐతే ఈ ఐటీ నిబంధనలు...

IT Regulations: మీ ఇంట్లో ఎక్కువ మొత్తంలో డబ్బు ఉందా; ఐతే ఈ ఐటీ నిబంధనలు తెలుసా?

IT Regulations
IT Regulations

IT Regulations: ధనం మూలం ఇదం జగత్ అంటారు.. అంటే డబ్బు వల్ల, డబ్బు కోసం, డబ్బుతోనే ఈ ప్రపంచం నడుస్తోంది. అలాంటి డబ్బు ప్రభుత్వాలను శాసిస్తోంది. ప్రభుత్వాలనూ కూల్చేస్తోంది. డబ్బు కిటుకు తెలిసే నరేంద్ర మోడీ పెద్ద నోట్లు రద్దు చేశాడు..గూగుల్ పే,ఫోన్ పే, పేటీఎం, అమెజాన్ పే.. వంటివి తెరపైకి వచ్చేలా చేసాడు. అయినప్పటికీ డబ్బు కట్టడి ఆగుతోందా? డబ్బు మార్పిడి ఆగుతోందా? పింక్ నోట్ లకు అలవాటు పడ్డ ప్రాణాలు.. పైసల కోసం రకరకాల పన్నాగాలు పన్నుతున్నాయి. మొన్న ఢిల్లీ లిక్కర్ స్కాం లో సౌత్ గ్రూప్ న కు చెందిన వ్యక్తులు 100 కోట్లను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి హవాలా మార్గంలో తరలించారని వార్తలు వినిపించాయి. ఆమధ్య బెంగళూరులో బిజెపి మంత్రి కొడుకు ఆరు కోట్లు లంచం తీసుకుంటూ దొరికాడు.. ఏటీఎంల చుట్టూ తిరిగినా, బ్యాంకుల్లో ప్రదక్షిణలు చేసినా అందని నోట్లు.. పెద్దల దగ్గరికి దర్జాగా వెళుతున్నాయి. దేశంలో ఇన్ని వ్యవస్థలు ఉన్నా.. వాళ్లను ఏమీ చేయలేకపోతున్నాయి. వాళ్లు ఆడించినట్టు ఆడుతున్నాయి. తాజాగా మన రాజ్యాంగం ప్రసాదించిన వ్యవస్థల్లో ఒకటైన ఆదాయపు పన్ను శాఖ సరికొత్త నిబంధనలను తీసుకొచ్చింది. అవి ఏంటయ్యా అంటే.. మన ఇంట్లో డబ్బు పరిమితికి మించి ఉండకూడదట.. ఒకవేళ ఉంటే వాటికి లెక్కలు చెప్పాలట.. లెక్కలు చెప్పకుంటే ఆ డబ్బును సీజ్ చేస్తారట.. మనం సరైన ఆధారాలు చూపించి ఆ డబ్బులు మళ్ళీ వెనక్కి తీసుకోవాలట.. లేకుంటే కటకటాల పాలు కాక తప్పదట.. వింటుంటేనే ఆశ్చర్యంగా ఉంది కదూ.. ఎలుకను పట్టేందుకు ఇళ్ళంతా తగలబెట్టినట్టు ఉంది కదూ.

ఇదంతా ఎందుకు చేస్తోంది అంటే గత కొన్ని నెలల క్రితం వివిధ రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. ప్రజాస్వామ్యంలో ఎన్నికలు జరుగుతున్నప్పుడు ధనస్వామ్యం వర్ధిల్లడం అనేది కామన్ కాబట్టి.. ఇప్పుడు ఎన్నికల్లో పోటీ చేసే వాళ్ళు కూడా శ్రీమంతులే కాబట్టి… ధన ప్రవాహం దర్జాగా సాగుతోంది. ఇక వివిధ రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు సోదరుల నిర్వహించినప్పుడు అక్కడి ప్రజల ఇళ్లల్లో భారీగా నగదు లభించింది.. ఈ క్రమంలో ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఏ రూపంలో వచ్చింది? ఎన్నికల సమయంలోనే ఇంత డబ్బు ఎవరు ఇచ్చారు? అనేవి అధికారులకు శేష ప్రశ్నలుగా మిగిలాయి. ఈ క్రమంలో ధన ప్రవాహ నిరోధానికి కళ్లెం వేయాలని ఆదాయపు పన్ను శాఖ నిర్ణయించింది.

IT Regulations
IT Regulations

దర్యాప్తు సంస్థలకు అనుమానం కలిగి సోదాలు చేస్తే.. ఒకవేళ భారీగా నగదు పట్టుబడితే..అది ఎక్కడి నుంచి వచ్చింది? ఎలా వచ్చింది? ఏ రూపంలో వచ్చింది.. అవన్నీ కూడా అధికారులకు తెలియజేయాలి. ఒకవేళ చెప్పని పక్షంలో ఈడి, సిబిఐ వంటి దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఒకవేళ లెక్కల్లో చూపని నగదు పట్టుబడితే సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ కారం 137 శాతం వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆర్థిక సంవత్సరంలో 20 లక్షల కుమించి నగదు లావాదేవీలు జరిపితే దానికి సంబంధించి సరైన ఆధారాలు సంబంధిత శాఖ అధికారులకు ఇవ్వాల్సి ఉంటుంది. లేనిపక్షంలో జరిమానా విధించవచ్చు. ఒకేసారి 50 వేల కంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేయడానికి లేదా విత్ డ్రా చేయడానికి కచ్చితంగా పాన్ నెంబర్ ఇవ్వాలి. ఒక వ్యక్తి ఒక సంవత్సరంలో 20 లక్షల రూపాయలు నగదు డిపాజిట్ చేస్తే పాన్, ఆధార్ గురించి సమాచారం ఇవ్వాలి. పాన్,ఆధార్ సమాచారం ఇవ్వని పక్షంలో భారీగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.. రెండు లక్షలకు మించి నగదు రూపంలో కొనుగోళ్ళు జరిపితే పాన్, ఆధార్ కాఫీ ఇవ్వాల్సి ఉంటుంది. 30 లక్షల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కొనుగోలు, అమ్మకాలు జరిపితే.. సదరు వ్యక్తిని దర్యాప్తు సంస్థ అధికారులు ప్రశ్నించేందుకు అధికారం ఉంటుంది. క్రెడిట్, డెబిట్ కార్డు చెల్లింపు సమయంలో ఒక వ్యక్తి లక్ష కంటే ఎక్కువ మొత్తాన్ని ఒకేసారి చెల్లించినట్లయితే అప్పుడు అధికారులు విచారణ చేసేందుకు అవకాశం ఉంటుంది.

ఇక ఒక రోజులో మీ బంధువుల నుంచి రెండు లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకోలేరు.. ఒకవేళ తీసుకున్నా బ్యాంకు ద్వారా జరగాలి. ఇక నగదు రూపంలో విరాళం ఇచ్చే పరిమితిని అధికారులు రెండువేలుగా నిర్ణయించారు. ఏ వ్యక్తి మరో వ్యక్తి నుంచి నగదు రూపంలో 20వేల మించి రుణం తీసుకోరాదు. బ్యాంకు నుంచి రెండు కోట్ల కంటే ఎక్కువ నగదు విత్ డ్రా చేస్తే టిడిఎస్ చెల్లించాల్సి ఉంటుంది.

ఈ నిబంధనలు విధించేందుకు ప్రధాన కారణం ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో ఆయా ఇళ్లల్లో భారీగా నగదు పట్టుబడటమే.. దీనివల్ల ప్రజాస్వామ్యం నగుబాటుకు గురై ధనస్వామ్యం వర్ధిల్లుతోందని అధికారుల ప్రధాన ఆరోపణ. అందు గురించే ఈ నిబంధనలను తెరపైకి తీసుకొచ్చారు.. ఇవి స్పష్టంగా అమలవుతాయా లేదా అనేది పక్కన పెడితే.. ప్రస్తుతానికి అయితే హాట్ హాట్ చర్చకు దారితీస్తున్నాయి.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Exit mobile version