Airplanes Fly In Thunderstorms: విదేశాలకు వెళ్లాలంటే విమానాలు ఎక్కాల్సిందే. మనలో చాలా మంది విమానాలు చూడని వారే ఉంటారు. విమానంలో ప్రయాణించాలంటే చాలా డబ్బు ఖర్చవుతుంది. విమాన ప్రయాణం అత్యంత ఖర్చుతో కూడుకున్నది కావడం గమనార్హం. ఈ నేపథ్యంలో విమాన ప్రయాణంపై అందరికి ఆసక్తి ఉండటం సహజమే. జీవితంలో ఒక్కసారైనా విమానం ఎక్కితే ఎలా ఉంటుందో అనే ఆశ అందరికి ఉంటుంది.
గాల్లో ఎగిరే విమానాలపై చాలా అనుమానాలు ఉంటాయి. అవి నడిచే తీరుపై కూడా మనకు అవగాహన ఉండదు. ఆకాశంలో ప్రయాణించే సమయంలో పిడుగు పడితే ఎలా ఉంటుంది. అనే సందేహాలు కూడా అప్పుడప్పుడు రావడం కామనే. ఈ క్రమంలో విమానాలు పిడుగుపాటును ఎలా ఎదుర్కొంటాయి. వాటి వద్ద ఎలాంటి రక్షణ చర్యలు ఉంటాయో తెలుసుకోవాలనే ఆతృత అందరికి ఉండటం మామూలే.
విమానం గాల్లో ఎగురుతున్నప్పుడు పెద్ద పిడుగులు పడితే డేంజరే. కానీ చిన్న పిడుగులు ఏం చేయలేవు. విమానం రాగా జాలి వేస్తారు. దీంతో పిడుగులు పడినా పెద్ద నష్టమేమీ ఉండదు. కాకపోతే పిడుగు కాక్ పిట్ మీద కానీ ఇంజిన్ మీద కాని వేస్తే ప్రమాదకరమే. అందుకే ఉరుములు మెరుపులు వచ్చే సమయాల్లో విమానాలు నడిపేందుకు సాహసించరు.
ఒకవేళ ఆకాశంలో ఉండగానే వాతావరణం సహకరించకపోతే దగ్గరలోని విమానాశ్రయంలో ల్యాండింగ్ చేస్తారు. అంతేకాని రిస్క్ తీసుకోరు. ఏదైనా అనుకోని ఉపద్రవం ఏర్పడితే దానికి బాధ్యులెవరవుతారు. అందుకే విమానాలు అనువైన పరిస్థితులు ఉంటేనే నడుపుతారు. లేదంటే నిలిపేస్తుంటారు. ఇలా విమానాల ప్రయాణంలో వాతావరణం చాలా ముఖ్యమైనది.