Lakshmi Sharma: సినిమా ఇండస్ట్రీ అంటే చాలా మందికి ఇష్టమే ఉంటుంది. తక్కువ సమయంలో అత్యున్నత శిఖరాలకు వెళ్లొచ్చు. కావాల్సినంత డబ్బు చేతికి వస్తుంది. దీంతో ఒక్క చాన్స్ కావాలని చాలా మంది తీవ్ర ప్రయత్నాలు చేస్తుంటారు. యువకులు, యువతులు ఎవరైనా ఇండస్ట్రీలో హీరో, హీరోయిన్ కావాలనే అనుకుంటారు. కానీ పోటీ కారణంగా అందరికీ అనుకున్నవిధంగా ఛాన్సెస్ రావు. దీంతో ఏ పాత్ర ఇచ్చినా సినిమాల్లో కొనసాగడానికి ట్రై చేస్తుంటారు. అలా ఓ నటి తనకు చిన్న పాత్రలే వచ్చినా వదులుకోలేదు. అయినా రాణించకపోవడంతో మలయాళం ఇండస్ట్రీకి వెళ్లింది. అక్కడా పలు సీరియళ్లలో నటిస్తూ అలరిస్తూ ఉంటుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసుకోవాలని ఉందా.
టాలీవుడ్ లోని పలు సినిమాల్లో నటించిన ఈమె పేరు లక్ష్మీ శర్మ. ఈ పేరు చెబితే ఎవరు గుర్తుపట్టరు. కానీ ఇంద్ర సినిమాలో చిరంజీవికి మేనకొడలుగా నందిని పాత్రలో నటించిన అమ్మాయి అనగానే వెంటనే గుర్తుకు వస్తుంది. లక్ష్మీ శర్మ అంతకుముందే ఇండస్ట్రీలోకి వచ్చింది. ‘అమ్మో ఒకటో తారీఖు’ సినిమాలో ఎల్బీ శ్రీరాం చిన్న కూతురిగా నటించింది. ఆ తరువాత సారీ నాకు పెళ్లయింది, ఆరుగురు పతివ్రతలు వంటి సినిమాల్లో నటించింది.
హీరోయిన్ కాకపోయినా తన అందంతో అలరించిన ఈమె కొన్నాళ్ల పాటు టాలీవుడ్ లో తీవ్రంగా ప్రయత్నించినా సినిమాల్లో అవకాశాలు తక్కువగానే వచ్చాయి. దీంతో స్టార్ ఇమేజ్ రాలేదు. అయితే మలయాళం నుంచి ఆమెకు ఆఫర్లు వచ్చాయి. దీంతో ఏమాత్రం ఆలోచించకుండా అమ్మడు అక్కడికి వెళ్లి సీరియళ్లలో నటిస్తోంది. లక్ష్మీ శర్మ నటించిన ‘భక్తికత’ అనే సీరియల్ మలయాళంతో పాటు తెలుగులో కూడా ప్రసారం అవుతోంది.
లేటేస్టుగా లక్ష్మీ శర్మకు సంబంధించి ఫోటోలు ఆకట్టుకుంటున్నాయి. ఇంద్ర సినిమాలో ఎంతో నాజుగ్గా ఉన్న లక్ష్మీ శర్మ ప్రస్తుతం బొద్దుగా తయారైంది. గుర్తుపట్టేలకుండా ఉన్న ఆమె ఫొటోలను చూసి సినీ ఆడియన్స్ షాక్ అవుతున్నారు. అయితే తెలుగులో అవకాశం వస్తే మళ్లీ చేస్తారా? అని కొందరు అడుగుతున్నారు. ఆ కామెంట్లకు లక్ష్మీ శర్మ ఎటువంటి సమాధానం ఇవ్వడం లేదు.