Diwali : శ్మశానంలో దీపావళి సంబురాలు .. ఎక్కడో తెలుసా?

Diwali: దీపావళి పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరక సంహారం జరిగిన మరుసటి రోజు అమావాస్య రావడంతో రాక్షస సంహారాన్ని స్వాగతిస్తూ దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. ఇదే సంప్రదాయం ప్రకారం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఏటా దీపావళి జరుపుకుంటున్నాం. మన ఆచారాలు, పండుగలు, సంప్రదాయాలను పాశ్చాత్య దేశాలు సైతం స్వాగతిస్తున్నాయి. ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు పండుగ జరుపుకునే అవకాశం ఇస్తున్నాయి. తాజాగా అమెరికా […]

Written By: NARESH, Updated On : October 24, 2022 8:15 pm
Follow us on

Diwali: దీపావళి పండుగకు హిందూ సంప్రదాయంలో ఎంతో విశిష్టత ఉంది. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నరక సంహారం జరిగిన మరుసటి రోజు అమావాస్య రావడంతో రాక్షస సంహారాన్ని స్వాగతిస్తూ దీపాలు వెలిగించి పండుగ చేసుకున్నారు. ఇదే సంప్రదాయం ప్రకారం కార్తీక శుద్ధ పౌర్ణమి రోజు ఏటా దీపావళి జరుపుకుంటున్నాం. మన ఆచారాలు, పండుగలు, సంప్రదాయాలను పాశ్చాత్య దేశాలు సైతం స్వాగతిస్తున్నాయి. ఆయా దేశాల్లో స్థిరపడిన భారతీయులు పండుగ జరుపుకునే అవకాశం ఇస్తున్నాయి. తాజాగా అమెరికా ఉపాధ్యక్షురాలు భారతీయ సంతతికి చెందిన కమలా హ్యారీస్‌ దీపావళి జరుపుకున్నారు. అమెరికాలోని న్యూయార్క్‌లో వచ్చే ఏడాది నుంచి దీపావళికి సెలవు ప్రకటించింది. దీపావళి రోజు లక్ష్మీ అనుగ్రహం కోసం అంతా ధనలక్ష్మీ పూజ నిర్వహిస్తారు. పిరిసంపదలు సమకూరాలని ప్రార్థిస్థారు. అయితే అక్కడ మాత్రం ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా శ్మశానంలో దీపావలి పండుగ జరుపుకోవడం అనవాయతీగా వస్తోంది.

ఆరు దశాబ్దాలకుపైగా శ్మశానంలో సంబురాలు..
దీపావళి పండుగ అంటే అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి సంతోషాలతో కూడిన వెలుగులు రావాలని కోరుతూ చేసుకునే పండుగ. ప్రతి ఒక్కరూ ఇంటి దీపావళి పండుగ అంటే అందరి జీవితాల్లో చీకట్లు తొలగిపోయి సంతోషాలతో కూడిన వెలుగులు రావాలని కోరుతూ చేసుకునే పండుగ. ప్రాంతంతో సంబంధం లేకుండా ప్రతిచోట దీపావళిని ఇంటిల్లిపాదీ జరుపుకుటారు. ఇంటిని విద్యుత్‌ దీపాలు లేదంటే ప్రమిదలతో దీపాలతో అలంకరిస్తారు. అందరు దేవుళ్లను పూజిస్తారు. ధనలక్ష్మీ పూజ చేస్తారు. కరీంనగర్‌లో మాత్రం ఆరు దశబ్దాలకుపైగా స్మశానంలోనే దీపావళి పండుగను జరుపుకునే సాంప్రదాయం కొనసాగుతుంది. పూర్వీకులను స్మరించుకుంటూ కుటుంబ సభ్యులను ఖననం చేసిన శ్మశాన వాటికలో సమాధుల వద్ద దీపాలు వెలిగించి వేడుక చేసుకుంటారు. వినడానికి కొత్తగా, వింతగా అనిపించిన చాల కుటుంబాలు ఈ సంప్రదాయాన్ని ఆచరిస్తున్నాయి.

వారం రోజుల ముందు నుంచే ఏర్పాట్లు..
కరీంనగర్‌లోని కార్ఖానాగడ్డలో ఉన్న హిందూ శ్మశాన వాటికలో దీపావళి జరుపుకోవడం మొదట ప్రారంభమైంది. పండగకు వారం రోజుల ముందే స్మశాన వాటిక అంతా శుభ్రం చేస్తారు. సమాధులకు రంగులు వేస్తారు. పంగు రోజు చనిపోయిన వారి సమాధుల వద్దకు కుటుంబ సభ్యులంతా వెళ్లి పూలతో అలంకరిస్తారు. సాయంత్రం చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ దీపాలు వెలిగించి పూజలు చేస్తారు. పితృదేవతలకు నైవేద్యాలు సమర్పిస్తారు. తర్వాత అక్కడే టపాకాయలు కాలుస్తారు. రాత్రి పది గంటల వరకూ అక్కడే గడిపి తిరిగి ఇళ్లకు వెళ్లిపోతారు.

పూర్వీకులను స్మరించుకోవడమే అసలైన పండుగగా..
పూర్వీకులను స్మరించుకోవడమే అసలైన దీపావళి పండుగగా భావించే సంప్రదాయం కరీంనగర్‌లో కొనసాగుతోంది. ఆరు దశాబ్దాలకుపైగా వస్తున్న ఈ సంప్రదాయాన్ని నేటి తరం కూడా కొనసాగిస్తోంది. సాయంత్రం వరకు ఇళ్లలో పూజలు చేసుకుంటారు. సాయంత్ర కాగానే శ్మశానవాటికకు వెళ్లిపోతారు. ఇందు కోసం ఉపాధి కోసం వెళ్లి వివధ ప్రాంతాల్లో స్థిర పడిన వారు కూడా దీపావళి పండగకు మాత్రం కచ్చితంగా కరీంనగర్‌కు చేరుకుంటారు. తమ కుటుంబ సభ్యులతో కలిసి సమాధుల వద్దకు వెళ్లి పూర్వీకులకు నివాళులర్పిస్తారు. తమ పూర్వీకులు లేనిదే తాము లేము కాబట్టి పూర్వికులను స్మరించుకోవడమే తమకు నిజమైన దీపావళి అని చెబుతుంటారు.

ప్రపంచంలో ఎక్కడా లేని సంప్రదాయం కరీనంగర్‌లో మాత్రం నేటికీ కొనసాగుతోంది. అందరూ దానిని అంగీకరిస్తున్నారు కూడా.

Tags