
Women Fighting: మహిళలకు చీరలంటే మహా ఇష్టం. అదీ.. డిస్కౌంట్‌లో వస్తున్నాయంటే.. ఎక్కడున్నా సరే ఆ షాపులో వాలిపోవాల్సిందే. బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్ శారీ సెంటర్ కూడా ఇటీవల డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించింది. దీంతో చీరలు కొనుగోలు చేసేందుకు మహిళలు ఆ దుకాణానికి పోటెత్తారు. అందులో ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. ఇంకేముంది.. ‘నాక్కావాలంటే.. నాకే కావాలంటూ’ ఇద్దరూ గొడవకు దిగారు. అది కాస్తా ముదిరి జుట్టు పట్టుకుని కొట్టుకునేవరకు వెళ్లింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
కొత్త విషయం కాకపోయినా..
చీరల కోసం మహిళలు కొట్టుకోవడం కొత్త విషయం కాకపోవచ్చు కానీ అది ఎప్పుడైనా వినడానికి చూడటానికి ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. సహజంగానే చీరలంటే అంటే మహిళలకు చాలా ఇష్టం. అందులోనూ డిస్కౌంట్‌లో చీరలు వస్తున్నాయంటే ఇకేంముంది .. అది ఎక్కడున్న సరే వెళ్లారు. ఎంతమంది ఉన్నా అక్కడినుంచి చీరలు తెచ్చుకుంటారు. తాజాగా బెంగళూరులోని మల్లేశ్వరం ప్రాంతంలో ఉండే మైసూరు సిల్క్ శారీ సెంటర్ కూడా ఇటీవల డిస్కౌంట్ ధరలతో ఇయర్లీ శారీ సేల్ నిర్వహించింది. బయట మార్కెట్ కంటే తక్కువ ధర ఉండటం, చీరలు కూడా బాగుండటంతో కొనుగోలు చేసేందుకు భారీగానే మహిళలు వచ్చారు. భారీగా మహిళలు వస్తారని ముందుగానే ఊహించిన షాపు యజమానులు పోలుసు భద్రతను కూడా ఏర్పాటు చేశారు.
ఒకే చీర.. ఇద్దరికి నచ్చింది..
అయితే షాపింగ్‌కు వచ్చిన ఓ ఇద్దరు మహిళలకు ఒకే చీర నచ్చింది. దీంతో అది నాకంటే.. నాకు అంటూ పంతం పట్టారు. ఈ విషయంలో తగ్గదేలే అన్నట్టుగా ఇద్దరూ వ్యవహరించారు. చివరికి ఇద్దరి మధ్య గొడవ మరింతగా ముదరడంతో జుట్టు పట్టుకుని మరి కొట్టుకున్నారు. మధ్యలో పోలీసులు కలగజేసుకుని గొడవను ఆపారు. షాపింగ్ కోసం వచ్చిన మిగతా మహిళలు వీరిని చూస్తుండి పోయారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

నెటిజన్ల కామెంట్లు..
ఈ వీడియోపై నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లు పెడుతున్నారు. ఒక్క చీర కోసం ఎంతకైనా తెగిస్తారా బాబోయ్ అంటూ షాక్ అవుతున్నారు. మహిళలు భారీ సంఖ్యలో ఎలాగూ వస్తారు కాబట్టి అన్‌లైన్ లోనే ఆఫర్లు పెట్టొచ్చు కదా అని మరి కొంతమంది సలహా ఇస్తున్నారు. మరికొంతమంది అయితే తమ షాపులో చీరలకు ఎంత డిమాండ్ ఉందో చెప్పేందుకే ఈ వీడియోను సోషల్ మీడియాలో ప్రకటనగా రిలీజ్ చేసి ఉంటారు అంటూ ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు.
Mysore silk saree yearly sale @Malleshwaram .. two customers fighting over for a saree.👆🤦♀️RT pic.twitter.com/4io5fiYay0
— RVAIDYA2000 🕉️ (@rvaidya2000) April 23, 2023