18 Pages Collections: ఈ ఏడాది పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్స్ గా నిలిచినా చిత్రాలలో ఒకటి ‘కార్తికేయ 2′..కుర్ర హీరో నిఖిల్ కి ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో మామూలు పేరు తెచ్చిపెట్టలేదు..కేవలం 15 కోట్ల రూపాయిల బడ్జెట్ తో తెరకెక్కించిన ఆ సినిమా సుమారు గా 60 కోట్ల రూపాయిలను వసూలు చేసింది..అంత పెద్ద భారీ బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన చేసిన ఒక డిఫరెంట్ లవ్ స్టోరీ ’18 పేజెస్’ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదలైంది.

టీజర్ మరియు ట్రైలర్ తోనే కాస్త ఆసక్తిని రేపిన ఈ సినిమాకి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది..కానీ ఇదే రోజు రవితేజ ధమాకా మూవీ విడుదల అవ్వడం..ఆడియన్స్ కి ఆ చిత్రమే మొట్టమొదటి ఛాయస్ అవ్వడం తో ’18 పేజెస్ ‘ ఓపెనింగ్స్ పై ప్రభావం పడింది..ఈ సినిమా ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 22 కోట్ల రూపాయలకు జరిగింది.
ప్రస్తుతం ఉన్న ట్రెండ్ ప్రకారం మొదటి రోజు ఈ చిత్రానికి రెండు నుండి మూడు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది..కానీ బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే ఈ వసూళ్లు సరిపోవు..ఈరోజుల్లో సినిమాలు కేవలం మూడు రోజులు మాత్రమే బలంగా ఆడుతున్నాయి..ఆ మూడు రోజుల్లోనే ఎంత వసూళ్లు రాబట్టాలో అంత రాబట్టేయాలి.

ఫుల్ రన్ లో ఒకవేళ జనాలు నచ్చితే ‘కాంతారా’ లాగ ఆడేస్తుంది..కానీ ప్రతీ సినిమా కాంతారా అవుతుందా అంటే చెప్పలేము..కానీ పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి ఫుల్ రన్ ఉంటుందో లేదో చూద్దాం అంటున్నారు ట్రేడ్ పండితులు..’కార్తికేయ 2 ‘ లాగానే ఈ చిత్రం కూడా లాంగ్ రన్ లో నిలదొక్కుకుంటే బ్రేక్ ఈవెన్ చాలా తేలికగా అవుతుందని..నిఖిల్ కి బ్యాక్ 2 బ్యాక్ సూపర్ హిట్స్ పడినట్టు అవుతుందని చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు.