Homeఆంధ్రప్రదేశ్‌Eruvaaka Foundation Awards- 2022 : ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు-2022 ప్రధానోత్సవం

Eruvaaka Foundation Awards- 2022 : ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు-2022 ప్రధానోత్సవం

Eruvaaka Foundation Annual Awards of Excellence in Agriculture – 2022 : హైదరాబాద్ ,డిసెంబర్ 23, 2022: “ఏరువాక ఫౌండేషన్ వ్యవసాయ వార్షిక అవార్డులు -2022” ప్రధానోత్సవం శుక్రవారం ఘనంగా జరిగాయి. రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీలోని ఆడిటోరియంలో ఏర్పాటుచేసిన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా చేవెళ్ల పార్లమెంటు సభ్యుడు డా.గడ్డం రంజిత్ రెడ్డి హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయంగంగ అభివృద్ధి కోసం తమవంతుగా కృషిచేస్తున్న ఏరువాక నిర్వాహకులను ప్రశంసించారు.

ఈ సందర్భంగా ఏరువాక ఫౌండేషన్ ఫౌండర్ గారా రాఘవరావు మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రాల్లో వ్యవసాయ సంబంధిత సమాచారాన్ని అందిస్తూ అన్నదాతలకు అండగా నిలిచేప్రయత్నం చేసేందుకు “ఏరువాక ” మ్యాగజిన్ శ్రీకారం చుట్టిందని చెప్పారు. అందుకోసం ఎప్పటికప్పుడు మార్కెట్ లోకి వచ్చిన సాంకేతికతను, పరిశోధనలకు సంబంధించిన సమాచారాన్ని అందిస్తోంది “ఏరువాక”. సస్యరక్షణకోసం ఎలాంటి చర్యలు చేపట్టాలి..? ఏ సీజన్ లో ఏ పంట వేయాలి..? అంశాల పై రైతులకు “ఏరువాక ” మ్యాగజిన్ అవగాహన కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారు.

వ్యవసాయరంగాన్ని ప్రోత్సహించేందుకు “ఏరువాక ” మహా యజ్ఞాన్ని చేపట్టింది. అందుకోసమే “ఏరువాక ” మ్యాగజిన్ వార్షికోత్సవం సందర్భంగా వ్యవసాయరంగ అభివృద్ధికి పాటుపడేవారిని ఘనంగా సత్కరించేందుకు ముందుకు వచ్చింది. “ఏరువాక ఫౌండేషన్ యాన్యువల్ అవార్డ్స్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇన్ అగ్రికల్చర్-2022” పేరుతో ఉత్తమ శాస్త్రవేత్త,ఉత్తమ రైతు, ఉత్తమ విస్తరణ నిపుణుడు, ఉత్తమ వ్యవసాయ పాత్రికేయుడు, ఉత్తమ ఇన్నోవేషన్ ఐడియా, ఉత్తమ వ్యవసాయ ఈ- యాప్, ఉత్తమ వ్యవసాయ సామాజిక మాధ్యమం,ఉత్తమ సేంద్రియ వ్యవసాయ రైతు, ఉత్తమ మిద్దె తోటల పెంపక దారుల విభాగం ఇలా పలు విభాగాల్లో కృషిచేసినవారికి అవార్డుతోపాటు ఘనంగా సన్మానించారు.

ఈ కార్యకమంలో పీజేటీఎస్ఏయూ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్‌టెన్షన్ డా.వి.సుధారాణి, ఫార్మ్ 2ఫ్రిడ్జ్ వ్యవస్థాపకుడు వట్టి వెంకట్, ఏవీపీ అగ్రి.ఫిన్. ప్రాజెక్ట్స్ కోటక్ మహీంద్రా బ్యాంక్ , మెండు శ్రీనివాసులు, నవరత్న క్రాప్ సైన్స్ ఎండీ మహమ్మద్ అలీ, టెర్రేస్ గార్డెనింగ్ రైటర్ అండ్ స్పీకర్ తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

– ఏరువాక ఫౌండేషన్ వార్షిక వ్యవసాయ పురస్కారాల జాబితా..

1. ఉత్తమ శాస్త్రవేత్త విభాగం

డా|| పి. స్పందన భట్, సైంటిస్ట్ (అగ్రానమి), ఇన్స్టిట్యూట్ ఆఫ్ రైస్ రీసెర్చ్, ARI,PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| వై. ప్రవీణ్ కుమార్, పోగ్రాం కోఆర్డినేటర్, కృషి విజ్ఞాన కేంద్రం, ఆదిలాబాద్
డా|| వి. లక్ష్మి నారాయణమ్మ, సీనియర్ సైంటిస్ట్ (ఎంటమోలోజి), హెడ్ KVK, భద్రాద్రి కొత్తగూడెం
డా|| పి. జగన్ మోహన్ రావు, డైరెక్టర్, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| జెస్సీ సునీత, సైంటిస్ట్ (ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రిషన్), KVK, PJTSAU, వైరా, ఖమ్మం
డా|| ఏ. పోషాద్రి, సైంటిస్ట్ (ఫుడ్ టెక్నాలజీ), KVK, ఆదిలాబాద్
డా|| పిట్టల రాజయ్య, ప్రిన్సిపాల్ సైంటిస్ట్(అగ్రికల్చరల్ ఇంజనీరింగ్), రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| మాలావత్ రాజేశ్వర్ నాయక్, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, ప్రోగ్రాం కోఆర్డినేటర్, హెడ్ KVK, బెల్లంపల్లి, మంచిర్యాల
డా|| బొద్దులూరి రాజేశ్వరి, ప్రిన్సిపాల్ సైంటిస్ట్, సీడ్ రీసెర్చ్ అండ్ టెక్నాలజీ సెంటర్, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
డా|| ముళ్ళపూడి రామ్ ప్రసాద్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అగ్రికల్చర్ కాలేజీ, అశ్వారావుపేట,భద్రాద్రి కొత్తగూడెం
డా|| మండల రాజశేఖర్, కృషి విజ్ఞాన కేంద్రం,నాగర్ కర్నూల్
డా|| ఎన్. రాజన్న, పోగ్రాం కోఆర్డినేటర్, హెడ్ KVK, మమ్నూర్, వరంగల్
డా|| వలపుదాసు అశోక్ కుమార్, డిప్యూటీ డైరెక్టర్, యానిమల్ హస్బెండరీ, గవర్నమెంట్ అఫ్ తెలంగాణ


2. ఉత్తమ రైతు విభాగం

చికోటి కీర్తి, పండ్ల సాగు, జనగాం
తుమ్మల రాణా ప్రతాప్, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ సిస్టమ్, ఖమ్మం
పులి లక్ష్మీపతి, పత్తి సాగు, బోయినపల్లి, రాజన్న సిరిసిల్ల
కటుకూరి తిరుపతి రెడ్డి, వరి సాగు, జయశంకర్ జిల్లా, ఘనపూర్
పడమటి పావని, పశుసంరక్షణ, యాదాద్రి భువనగిరి
డి. సంజీవ రెడ్డి, మిరప సాగు, భద్రాద్రి కొత్తగూడెం
సుంకారి రమాదేవి, మిల్లెట్స్ సాగు, హనుమకొండ
నైని సుమంత్, మొక్కజొన్న సాగు
కాపారబోయిన అరుణ్ క్రాంతి, ఆక్వాకల్చర్, జగిత్యాల
ఎమ్. రాంచంద్రయ్య, వినూత్న రైతు, నాగర్ కర్నూల్

3. టెర్రస్ గార్డెనింగ్
1st పులుగుజ్జు రేణుక, సూర్యాపేట
2nd మల్లవరపు లతా కృష్ణ మూర్తి, హైదరాబాద్
3rd కె. వనజా రెడ్డి, సరూర్‌నగర్, రంగారెడ్డి

4. సేంద్రియ\ సహజ వ్యవసాయం
1st నందుర్క సుగుణ, బెల్లంపల్లి, మంచిర్యాల
2nd సి. రవి సాగర్, పెద్దగూడం, వనపర్తి
3rd ఒగ్గు సిద్దులు, ఇటికాల పల్లి, జనగాం

5. ఉత్తమ విస్తరణ విభాగం
టి. నాగార్జున్, వ్యవసాయ విస్తరణ అధికారి, నారాయణరావుపేట, సిద్దిపేట


6. ఉత్తమ డిజిటల్ వేదిక
PJTSAU అగ్రికల్చరల్ వీడియోస్, ఎలక్ట్రానిక్ వింగ్, PJTSAU, హైదరాబాద్

7. ఉత్తమ వ్యవసాయ ఇ- యాప్
నాపంట, వి. నవీన్ కుమార్

8. ఉత్తమ FPO
డెక్కన్ ఎక్సోటిక్స్ ఇండియా ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్, డా|| ఎమ్. శ్రీనివాస రావు

9. ఉత్తమ విలేఖరి
షేక్ లాలా, ఈనాడు

10. ఉత్తమ సృజనాత్మక ఆలోచన విభాగం
PG & Ph. D
1st కె. ప్రెషియస్ బోజాంగ్, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ
2nd చిందం స్వాతి, PJTSAU, రాజేంద్రనగర్, హైదరాబాద్
3rd సామల సాయి మోహన్, కేలప్పజీ కాలేజ్ ఆఫ్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, కేరళ

UG
1st జి. నిహారిక, PJTSAU, అగ్రికల్చర్ కాలేజీ, పాలెం
2nd గొర్రె అశోక్, డా. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ, హైదరాబాద్
3rd పి.ఎన్.వి.బి. సాయి శ్రీనిజా చౌదరి, కాలేజ్ ఆఫ్ ఫుడ్ సైన్స్ & టెక్నాలజీ, రుద్రూర్, నిజామాబాద్

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
RELATED ARTICLES

Most Popular