Director Teja: కొత్త నటులతో సినిమా తీయడంలో తేజ దిట్ట. తెలుగు సినిమా ఇండస్ట్రీకి తేజ ద్వారా చాలా మంది నటులు, టెక్నీషియన్లు వచ్చారు. ఇప్పుడు మంచి పొజిషన్లో ఉన్నారు. పునాది బలంగా ఉంటే ఇల్లు కలకాలం కొనసాగుతుంది.. ఈ విషయాన్ని తేజ ఫాలో అయి నటులకు మంచి ట్రైనింగ్ ఇస్తూ ఉంటారు. ఈ క్రమంలో తేజ కొందరు హీరో, హీరోయిన్లపై చేయి కూడా చేసుకుంటారు. తేజ చేతిలో దెబ్బలు తిన్న వారిలో ఉదయ్ కిరణ్, నవదీప్ తదితరులు ఉన్నారు. హీరోయిన్లు కూడా చాలా మంది తేజ చేత చెంప పగలగొట్టుకున్నారు. తాజాగా ఆయన మరోసారి ఓ కొత్త హీరో పై చేయి చేసుకున్నాడు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత కొడుకు కూడా.

చాలా కాలం తరువాత తేజ ‘అహింస’ అనే సినిమాను తీస్తున్నాడు. సాంప్రదాయాన్ని అనుసరిస్తూ ఈసారి కూడా కొత్తవాళ్లను పెట్టి సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో అభిరామ్ హీరోగా నటిస్తున్నాడు. ఆయన ఎవరో కాదు ప్రముఖ నిర్మాత సురేష్ బాబు కుమారుడు. సురేష్ బాబు సొంత బ్యానర్లో కుమారుడు అభిరామ్ ను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ఈ బాధ్యతను తేజ చేతిలో పెట్టాడు. ఎందుకంటే తేజతో మొదటి సినిమా చేస్తే ఆ తరువాత నటుల భవితవ్యం బాగుంటుంది అని ఇండస్ట్రీకి చెందిన కొందరి నమ్మకం.
‘అహింస’ షూటింగ్ లో భాగంగా తేజ ఓ లెన్త్ సీన్ తీయాలనుకున్నాడు. ఈ సీన్ లో అభిరామ్ నటించడానికి చాలా ఇబ్బందులు పడ్డాడు. అయితే సీన్ కరెక్ట్ రావడానికి అభిరామ్ చెంపపై తేజ ఒక్కటేశాడు. ఆ తరువాత సీన్ అనుకున్న విధంగా పండింది. ఎంత డైరెక్టర్ కొట్టినా ఓ నిర్మాత కొడుకు సహిస్తాడా..? దీంతో అభిరామ్ కొన్ని రోజుల పాటు షూటింగ్ రావడం మానేశాడు. భారీ అలక ప్రదర్శించిన అభిరామ్ ను తండ్రి సురేష్ బాబు బుజ్జగించడం తల ప్రాణం తోకకు వచ్చినంత పనైంది. మొత్తానికి ఎలాగోలా అభిరామ్ షూటింగ్ లో కొనసాగుతున్నారు.

అయితే ఇలా నటులపై చేయి చేసుకోవడం ఎందుకని అప్పట్లో కొందరు మీడియా మిత్రులు తేజను ప్రశ్నించారు. దీంతో తాను తీయబోయే సినిమా ఎక్కడా విఫలం కాకూడదని, ముఖ్యంగా నిర్మాతకు అన్యాయం చేయకూడదు అనే ఉద్దేశంతో అనుకున్న సీన్ అనుకున్న విధంగా చేయాలని ఇలా చేయి చేసుకుంటానని తేజ ఓపెన్ అయ్యాడు. ఈమధ్య తేజ సినిమాలు తక్కువయ్యాయి. కొందరు హీరోలు తేజ సినిమా అంటే భయపడుతున్నారు. కానీ అర్థం చేసుకొని ఆయన దగ్గర పనిచేసిన వాళ్లు ఇప్పుడు మంచి పొజిషన్లో ఉండడం విశేషం.