https://oktelugu.com/

S. S. Rajamouli: ఈజీగా డబ్బు సంపాదించాలని అడ్డదారులు…రాజమౌళి హాట్ కామెంట్స్

S. S. Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి దృష్టంతా ఎప్పుడూ సినిమాలపైనే. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. సినిమాలు తప్ప ఇతర కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించని ఈయన ఇటీవల ఓ స్పెషల్ ఈవెంట్ లో దర్శనమిచ్చారు. మైక్ అందుకున్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారని, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇంతకీ రాజమౌళి ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన […]

Written By:
  • Srinivas
  • , Updated On : April 13, 2023 / 03:37 PM IST
    Follow us on

    S. S. Rajamouli

    S. S. Rajamouli: ‘ఆర్ఆర్ఆర్’ డైరెక్టర్ రాజమౌళి దృష్టంతా ఎప్పుడూ సినిమాలపైనే. ఎలాంటి వివాదాల జోలికి పోకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంటారు. సినిమాలు తప్ప ఇతర కార్యక్రమాల్లో ఎక్కువగా కనిపించని ఈయన ఇటీవల ఓ స్పెషల్ ఈవెంట్ లో దర్శనమిచ్చారు. మైక్ అందుకున్న ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు కష్టపడకుండా ఈజీగా డబ్బులు సంపాదించాలని అడ్డదారులు తొక్కుతున్నారని, అటువంటి వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని అన్నారు. ఇంతకీ రాజమౌళి ఇలాంటి కామెంట్స్ చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అసలేం జరిగింది?

    తాను తీయబోయే ఓ సినిమా షూటింగ్ లో తనవద్ద పనిచేసే ఓ వ్యక్తి బ్యాంకు ఖాతా నుంచి 10 నెలల జీతం మాయమైంది. ఓ వ్యక్తి మేనేజర్ అని ఫోన్ చేసి ఓటీపీ చెప్పమనగానే సదరు వ్యక్తి వివరాలన్ని అందించాడు. దీంతో తన డబ్బులన్నీ మాయమయ్యాయని జక్కన్న చెప్పుకొచ్చాడు. హైదరాబాద్ లో జరిగిన ‘హ్యాక్ సమ్మిట్’లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జక్కన్న మాట్లాడుతూ సామాన్యుల నుంచి ధనవంతుల వరకు ప్రతి ఒక్కరూ సైబర్ నేరగాళ్ల వలలో చిక్కుతున్నారని అన్నారు. టెక్నాలజీ అందుబాటులోకి వస్తున్న తరుణంలో సైబర్ నేరగాళ్లు పుట్టుకొస్తున్నారని అన్నారు.

    ప్రజల్లో నేరాలపై అవగాహన లేకపోవడం వల్లే ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఆయన అన్నారు. కొందరు ఫోన్ చేసి డబ్బులు పంపించాలని అడిగతే పూర్తిగా నిర్దారించుకున్న తరువాతే మనీ సెండ్ చేయాలన్నారు. సైబర్ నేరగాళ్లు రకరకాల పద్దతుల్లో బురిడీ కొట్టిస్తున్నారని, వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలన్నారు. డబ్బుపై దురాశతో ఉన్నవారు ఈజీగా సంపాదించాలని ఇలాంటి తప్పిదాలు చేస్తారని అన్నారు. కష్టపడితే వచ్చిన సోమ్ములో ఉండే మజా ఎందులో దొరకదని ఆయన అన్నారు.

    S. S. Rajamouli

    చిన్న పిల్లలను పెంచేటప్పుుడు వారికి కష్టం నేర్పించాలన్నారు. సైబర్ నేరాలపై తెలుగు ప్రజలకు అవగాహన కలిగించేలా విస్తృత ప్రచారం చేయించాలని ఆయన అన్నారు. డబ్బులు పంపించాలని తనకు కూడా చాలా మంది ఫోన్లు చేవారని, కానీ నేను వారిని పట్టించుకోలేదన్నారు. ఒక్కసారి అకౌంట్లో డబ్బులు గల్లంతయితే ఆ తరువాత రికవరీ కావడం కష్టమని, ముందగానేజాగ్రత్తగా ఉండాలని రాజమౌళి సూచించారు.